Su From So OTT: ఓటీటీకి.. వచ్చేస్తోన్న రీసెంట్ హర్రర్, కామెడీ! పోతారు అంతా.. నవ్వి నవ్వి పోతారు
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:26 AM
ఓ అనామక చిత్రంగా థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు నెలకొల్పిన చిత్రం సు ఫ్రమ్ సో.
గత నెల మొదటి వారం కన్నడ నాట ఓ అనామక చిత్రంగా థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు నెలకొల్పిన చిత్రం సు ఫ్రమ్ సో (Su From So). జేపీ తుమినాద్ (JP Thuminad) ఫస్ట్ టైం రచన దర్వకత్వం చేయడంతో పాటు కీ రోల్ చేశాడు. అగ్ర నటుడు రాజ్ బీ షెట్టి ఓ ప్రధాన పాత్రలో కనిపించి అలరించగా ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరించాడు. షనీల్ గౌతమ్ (Shaneel Gautham), సంద్యా అరకేరె (Sandhya Arakere) లాంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కన్నడ నాట మంచి స్పందన రావడంతో ఆ వెంటనే మలయాళం ఆపై తెలుగులో మైత్రీ (Mythri Movie Makers) ద్వారా ఈ మూవీని రిలీజ్ చేయగా విడుదలైన ప్రతి చోటా మంచి మార్కులే కొట్టేసింది. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.
కథ విషయానికి వస్తే.. కర్ణాటకలోని ఓ మూరుమూల పల్లెలో మధ్య వయస్కుడు రవన్న పెద్దరికం వహిస్తూ అక్కడి ప్రజలకు తలలో నాలుకలా ఉంటుంటాడు. మరోవైపు అశోక్ అనే వ్యక్తి ఓ అమ్మాయిని ఇష్టపడి తనతో మాట్లాడాలని ఓ రోజు రాత్రి ఆమె ఇంటికి వెళతాడు. అయితే అ అమ్మాయి బాత్రూంలో ఉందని చూద్దామని కక్కుర్తి పడతాడు. తీరా చూస్తే అక్కడ అ అమ్మాయి స్థానంలో వృద్ధురాలు ఉంటుంది. దీంతో అమె గుర్తించే లోపు అక్కడి నుంచి పరుగు లంకించుకుంటాడు. అయితే అప్పటికే ఇంటికి ఎవరో దొంగ వచ్చాడంటూ ఆ వృద్దురాలు చెప్పడంతో తెల్లారే సరికి ఊరంతా ప్రచారం జరిగి పెద్ద సమస్యగా మారుతుంది. దీంతో దానిని డైవర్ట్ చేయాలని సులోచన అనే దయ్యం ఆవహించినట్లు అశోక్ నటించడం మొదలు పెడతాడు. దీంతో ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంటుంది. దీంతో ఊరంతా భయ పడుతూ ఆ వీధి వైపు వెళ్లడానికి కూడా జంకుతుంటారు. ఇక తప్పక ఓ ఓ స్వామిజీని సైతం పట్టుకొస్తారు. తమ దగ్గరలో ఉన్న ఊరికి చెందిన సులోచన అనే ఆవిడ ఆత్మనే అశోక్ ని ఆవహించిందనే తేల్చేస్తారు.
ఈ నేపథ్యంలో రవన్న, ఆ ఊరు ఏం చేసింది, దయ్యాన్ని వదిలించారా, అసలు సులోచన ఎవరు ఆమె కూతురికి ఈ డ్రామాతో ఎలాంటి సంబంధం ఉంది, అశోక్ దీనిని నుంచి బయట పడ్డాడా లేదా అనే ఆసక్తికరమైన కథనంతో సినిమా సాగుతూ చూసే వారికి సీటు కూర్చోనియని విధంగా కామెడీతో అల్లాడిస్తారు. ఆ ఆత్మని వదల గొట్టే క్రమంలో ఆ ఊరి వారు పడే పాట్లతో ఈ ‘సు ఫ్రమ్ సో’ సినిమా అద్యంతం నవ్వుల పూయిస్తూ సాగుతుంది. ప్రతీ ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉండి ఎక్కడా అసభ్యత, అశ్లీలతలకు తావీయకుండా ఇంటిల్లిపాద హాయిగా ఒక దగ్గర కూర్చోని చేసే విధంగా చిత్రం ఉంటుంది. ఇప్పుడీ చిత్రం జీయో హాట్‌స్టార్ (Jio Hotstar) ఓటీటీలో కన్నడతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్‌లో మిస్సయిన వారు, మరోసారి చూడాలనుకునే వారికి, మంచి ఆరోగ్యకరమైన వినోదం ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఔషదం.