సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rana Daggubati: రానాకు మళ్లీ ఈడీ నోటీసులు

ABN, Publish Date - Jul 23 , 2025 | 07:23 PM

బెట్టింగ్ యాప్ (Betting App) కేసు టాలీవుడ్ లో ఎంతగా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Rana Dggubati

Rana Daggubati: బెట్టింగ్ యాప్ (Betting App) కేసు టాలీవుడ్ లో ఎంతగా సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి.. డబ్బులు పొగ్గొట్టుకొని ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సెలబ్రిటీల వరకు ఈడీ కేసులు పెట్టి.. విచారణకు రావాలని సమన్లు జారిజేసింది.


బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినందుకు నిర్వాహకులు ఇచ్చిన రెమ్యూనరేషన్ మనీలాండరింగ్ అయ్యిందనే అనుమానంతో స్టార్ నటులు అయిన రానా దగ్గుబాటి. ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీ, విజయ్ దేవరకొండలను విచారించడానికి ఈడీ రావాల్సిందిగా కోరింది. రానా దగ్గుబాటిని జూలై 23 న విచారణకు రమ్మని కోరగా.. ముందస్తు సినిమా షూటింగ్స్ వలన ఆరోజు విచారణకు హాజరుకాలేనని చెప్పడంతో.. మరోసారి రానాకు ఈడీ నోటీసులు పంపింది.


జూలై 23 న రాలేదు కాబట్టి ఆగస్టు 11 న కచ్చితంగా విచారణకు రావాలని తెలిపింది. ఇక రానా కాకుండా ప్రకాష్ రాజ్ జూలై 30 న, ఆగస్టు 6 న విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ ఆగస్టు 13 న విచారణకు హాజరుకావాలని తెలిపింది. మరి ఈ విచారణలో ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటపడతాయో చూడాలి.

Tabu: ఈ వయస్సులో కూడా సీనియర్ బ్యూటీ సెగలు పుట్టిస్తుందే

Bhadrakali: విజయ్‌ ఆంటోని.. భద్రకాళి టీజ‌ర్‌

Updated Date - Jul 23 , 2025 | 07:23 PM