Bhadrakali: విజయ్ ఆంటోని.. భద్రకాళి టీజర్
ABN , Publish Date - Jul 23 , 2025 | 07:09 PM
విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన కొత్త చిత్రం ‘భద్రకాళి
ఇటీవలే మార్గన్ అనే సినిమాతో తమిళం, తెలుగు భాషల్లో మంచి విజయం అందుకున్న విజయ్ ఆంటోని (Vijay Antony) కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన కొత్త చిత్రం ‘భద్రకాళి’ (Bhadrakali). ఇది ఆయనకు 25వ చిత్రం కావడం విశేషం. అరుణ్ ప్రభు (Arun Prabu) దర్శకుడు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. నియో పొలిటికల్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ మూవీలో విజయ్ ఆంటోని ఫ్యామిలీమ్యాన్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, ఉన్నతాధికారిగా పలు శక్తిమంతమైన లుక్స్‌లో కనిపించనున్నాడు.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. 2 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్న టీజర్‌లో అనేక రకాల సన్నివేశాలు చూపించి రక్తి కట్టించారు. సంభాషణలు, విజువల్స్ కూడా బావున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ఇదిలాఉంటే.. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు.
అయితే మొదట ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా రిలీజ్ అంటూ నాలుగు నెలల క్రితం ప్రకటించి టీజర్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా సురేశ్ ప్రొడక్షన్స్ (Suresh Productions) ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. విజయ్ ఆంటోనినే ఈ చిత్రానికి సంగీతం అందించగా రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, షెల్లీ కాలిస్ట్ సినిమాటోగ్రఫీ చేశారు.