Tabu: ఈ వయస్సులో కూడా సీనియర్ బ్యూటీ సెగలు పుట్టిస్తుందే

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:44 PM

అందం, అభినయం కలబోసిన హీరోయిన్స్ లో టబు (Tabu) ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Tabu

Tabu: అందం, అభినయం కలబోసిన హీరోయిన్స్ లో టబు (Tabu) ఒకరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కూలీ నెం 1 సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇక నిన్నే పెళ్లాడతా సినిమాలో పండుగా కనిపించి కుర్రకారు గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించిన టబు.. హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.


ఇక అందరి హీరోయిన్స్ లా కెరీర్ స్లో అయ్యాకా పెళ్లి చేసుకోకుండా.. సింగిల్ గానే ఒడిదుడుకులను ఎదుర్కుంటూ వస్తుంది. టబు పెళ్లి చేసుకోకపోవడానికి అజయ్ దేవగణ్ అని కో కొందరు.. నాగార్జున అని మరికొందరు మాట్లాడుకుంటారు. అందులో ఎలాంటి నిజం లేదని, తనకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని టబు ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా టబు తన సత్తా చాటింది.


సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా అమ్మడు యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. 57 ఏళ్ల వవస్సులో కూడా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది. తాజాగా వెకేషన్ లో టబు అందాల ఆరబోత చేసి అదరగొట్టింది. స్లీవ్ లెస్ క్రాప్ టాప్ లో క్లివేజ్ షో చేస్తూ మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలకు అభిమానులు.. అందాల అప్సరస అని కొందరు.. సూపర్.. సెగలు పుటిస్తుందిగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Saiyaara: కుర్రాళ్ల‌ దెబ్బ‌.. బాలీవుడ్‌లో క‌లెక్ష‌న్ల సునామీ! ఛావా రికార్డులు మ‌టాష్‌

ChiruAnil: మరీ ఇంత స్పీడా.. ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి

Updated Date - Jul 23 , 2025 | 09:38 PM