Karthikeya: కార్తికేయ సినిమాను వదులుకున్న స్టార్ హీరో.. కేవలం ఆ భయంతోనే

ABN , Publish Date - Oct 07 , 2025 | 07:03 PM

ఇండస్ట్రీలో ఒక సినిమాకు మొదట ఒక హీరోను అనుకోని.. ఆతరువాత మరో హీరోకి షిఫ్ట్ అవ్వడం సర్వ సాధారణం.

Karthikeya

Karthikeya: ఇండస్ట్రీలో ఒక సినిమాకు మొదట ఒక హీరోను అనుకోని.. ఆతరువాత మరో హీరోకి షిఫ్ట్ అవ్వడం సర్వ సాధారణం. కొన్నిసార్లు కథ నచ్చక. ఇంకొన్నిసార్లు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక, మరికొన్నిసార్లు తమకు సెట్ కాదని హీరోలు ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. తాము రిజెక్ట్ చేసిన సినిమాలు ప్లాప్ అయితే ఏమో కానీ.. హిట్ అయితే మాత్రం చాలామంది అయ్యో అనవసరంగా వదులుకున్నామే అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఓకే సూపర్ హిట్ సినిమాను అల్లరి నరేష్ వదులుకున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పుకొచ్చాడు.


కుర్ర హీరో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా కార్తికేయ. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2014 లో రిలీజ్ అయ్యి భాగారి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టింది. అయితే మొదట కార్తికేయ సినిమా కథను చందూ మొండేటి అల్లరి నరేష్ కు వినిపించాడట. కథ మొత్తం నచ్చినా కూడా ఒకే ఒక్క భయంతో నరేష్ ఈ కథను రిజెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.


నరేష్ కు చిన్నతనం నుంచి పాములంటే చాలా భయమట. కార్తికేయ సినిమా మొత్తం పాము చుట్టూనే తిరుగుతుంది. దీంతో కథ నచ్చినా కూడా పాము ఉందనే ఒకే ఒక్క కారణంతో నరేష్ ఆ సినిమాను కాదన్నాడట. బయటే కాదు సినిమాలో పామును చూసిన కూడా నరేష్ చాలా భయపడతాడట. అలా ఆ ఒక్క భయంతో నరేష్ ఒక మంచి హిట్ ను వదులుకున్నాడు. అదే కనుక నరేష్ కు పడి ఉంటే అతని కెరీర్ కు బాగా హెల్ప్ అయ్యేది. ఏదిఏమైనా ఎవరికి రాసి ఉన్న కథ వారి వద్దకే చేరుతుంది. నిఖిల్ కి ఈ సినిమా రాసి పెట్టి ఉందేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Daughter of Prasad Rao: ‘డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు’.. కనబడుటలేదు..

The Rise of Kannada’s RRR : సక్సెస్ బాటలో ముగ్గురు శెట్టిలు

Updated Date - Oct 07 , 2025 | 07:03 PM