Daughter of Prasad Rao: ‘డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు’.. కనబడుటలేదు..

ABN , Publish Date - Oct 07 , 2025 | 06:46 PM

రాజీవ్‌ కనకాల, ఉదయబాను, ప్రధాన పాత్రధారులుగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న  సిరీస్‌ ‘డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు: కనపడుట లేదు’.

Daughter of Prasad Rao Missing

రాజీవ్‌ కనకాల (Rajiv Kanakala), ఉదయబాను(Udaya Bhanu), ప్రధాన పాత్రధారులుగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న  సిరీస్‌ ‘డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు: కనపడుట లేదు’ (Daughter of Prasad Rao Missing) అక్టోబర్‌ 31 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ సిరీస్‌లను అందించిన సౌతిండియన్‌ స్ర్కీన్స్‌ దీన్ని రూపొందించింది. వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఎమోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది.

‘మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని జీ 5 నమ్మకం. అలాంటి కథే ‘డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు: కనపడుట లేదు’. ఇది తండ్రి మనసులోని ప్రేమ, బలమైన ఇంటెన్సిటీని, మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి కుటుంబానికి కనెక్ట్‌ అయ్యే కథాంశమిది. దీన్ని సస్పెన్స్‌తో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీట్‌ ఎడ్జ్‌లో కూర్చొని పెడుతుంది. రాజీవ్‌ కనకాల, ఉదయభాను, వసంతిక అద్భుతమైన నటనతో మెప్పించారు. దర్శకుడు ఈ సిరీస్‌ను మనసుకి హత్తుకునేలా రూపొందించారు’ అని  జీ5 బిజినెస్‌ హెడ్‌ అనురాధ గూడూరు అన్నారు.

Rajiv.jpg

రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘డాటరాఫ్‌ ప్రసాద్‌ రావు: కనపడుటలేదు’లోని ఎమోషనల్‌ కంటెంట్‌ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మిస్టీరియస్‌, సస్పెన్స్‌ఫుల్‌ నెరేషన్‌తో సాగేది మాత్రమే కాదు. తండ్రీ కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ పాత్రలో నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్‌ను ఫీలయ్యాను. యూనివర్సల్‌ పాయింట్‌తో నడిచే కథతో రూపొందింది. కాబట్టి ఇది అందరికీ కనెక్ట్‌ అవుతుంది’ అని అన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 06:50 PM