Divvela Madhuri: పట్టుచీర, మల్లెపూలతో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి
ABN, Publish Date - Oct 12 , 2025 | 08:35 PM
దివ్వెల మాధురి (Divvela Madhuri).. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Divvela Madhuri: దివ్వెల మాధురి (Divvela Madhuri).. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత సంచలనం అంటే సినిమాలో నటించిందా.. రాజకీయాల్లో రచ్చ చేసిందా అంటే.. కాదు.. వాటన్నింటికి మించి ఒక వైసీపీ లీడర్ కు రెండో భార్యగా మారింది. అందులో తప్పేం ఉంది అంటే.. సదురు లీడర్ భార్యపిల్లలను వదిలేసి మరీ.. ఆమెతో ఉండడం, అది కూడా మీడియా ముందు కొత్తగా పెళ్ళైనవారిలా డ్యాన్స్ లు, రొమాన్స్ చేసి రోజురోజుకు షాక్ కి గురిచేస్తూనే ఉంటుంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి అందరికీ తెల్సిందే. ఆయన వయస్సు 59. ఈ వయస్సులో ఆయన దివ్వెల మాధురితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. తన భార్య వాణినే మాధురిని పరిచయం చేసిందని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. అప్పటికే మాధురికి పెళ్లి అవ్వడం, విడాకులు అవ్వడం జరిగాయి. ముగ్గురు అమ్మాయిలతో ఆమె ఒంటరిగా నివసిస్తుంది. ఆ సమయంలోనే దువ్వాడ కలవడం, అతనితో ప్రేమలో పడడం జరిగింది. ఇక దువ్వడా శ్రీనివాస్ పరువు, హోదా, రాజకీయాలు ఇవేమి ఆలోచించకుండా మాధురినే తన ప్రాణం అని చెప్పుకుంటూ వస్తున్నారు.
మాధురి - శ్రీనివాస్ పై ఎన్ని విమర్శలు వచ్చినా వారు పట్టించుకోలేదు. అలా గుర్తింపు తెచ్చుకున్న మాధురి చివరకు బిగ్ బాస్ హౌస్ లో తేలింది. నిండుగా పట్టుచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అచ్చతెలుగింటి గృహిణిలా రెడీ అయ్యి వచ్చింది. ఇక ఈమెకు సంబంధించిన స్పెషల్ వీడియోలో కూడా శ్రీనివాస్ ని తీసుకొచ్చి ఆయనే నా ప్రాణం అని చెప్పడం.. ఇద్దరికీ పాత సాంగ్స్ పెట్టి రొమాన్స్ చేశారు. అంతే కాకుండా ఒకరి గురించి ఒకరు మాట్లాడారు. ముఖ్యంగా దివ్వెల మాధురి అని కాకుండా ఆమె ఏకాంగ దువ్వాడ మాధురి ఆట చూస్తారుగా అని చెప్పడం మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Alekhyaa Chitti Pickles: పికిల్స్ పాప.. బిగ్ బాస్‌లో అడుగు పెట్టిందిరోయ్!ఇక రచ్చ రచ్చే
Pawan Kalyan: అన్న తరువాత తమ్ముడితో రావిపూడి..