Pawan Kalyan: అన్న తరువాత తమ్ముడితో రావిపూడి..

ABN , Publish Date - Oct 12 , 2025 | 07:25 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చాకా సినిమాలు చేస్తాడో లేదో అని అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చాకా సినిమాలు చేస్తాడో లేదో అని అభిమానులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. పదవిలో లేనప్పుడే పవన్ సినిమాలు చేయడు అనుకున్నారు. కానీ, పదవిలోకి వచ్చాకా పవన్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. హరిహర వీరమల్లు కన్నా ఓజీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక అంతకుముందు పవన్ ఒప్పుకున్న సినిమాలు తప్ప ఇంకేమి చేయడు అని చెప్పుకొచ్చారు. కానీ, ప్రస్తుతం పవన్ కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.


ఇక పవన్ కళ్యాణ్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ సినిమా కోసం ఈ కాంబో ఒక్కటి అయ్యింది. కరోనా వలన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక మరోసారి దిల్ రాజు.. పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.


నందమూరి బాలకృష్ణకు నేలకొండ భగవంత్ కేసరి ఇచ్చినట్లే.. అనిల్.. పవన్ కోసం ఒక మెసేజ్ ఓరియెంటెడ్ కథను అందివ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. మెగాస్టార్ చిరంజీవితో మన శంకర వరప్రసాద్ గారు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇది పూర్తికాగానే అనిల్ .. పవన్ కథను మొదలుపెట్టనున్నాడని సమాచారం. అయితే ఈ కాంబో కొందరిని ఆందోళనకు గురిచేస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలు అంటే క్రింజ్ ఉంటాయని.. పవన్ ను కూడా అలాగే చేస్తే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Andhra King Taluka Teaser: ఏం బతుకులురా మీవి.. ఛీఛీ.. ప్రతి ఫ్యాన్ కథ

Updated Date - Oct 12 , 2025 | 07:26 PM