Alekhyaa Chitti Pickles: పికిల్స్ పాప.. బిగ్ బాస్‌లో అడుగు పెట్టిందిరోయ్!ఇక రచ్చ రచ్చే
ABN , Publish Date - Oct 12 , 2025 | 07:58 PM
అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhyaa Chitti Pickles).. ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.
Alekhyaa Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhyaa Chitti Pickles).. ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. కెరీర్ మీద ఫోకస్ చేయాలమ్మ అనే ఒక్క మాటతో అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కాచెల్లెళ్లు బాగా ఫేమస్ అయ్యారు. వీరి వలన అందరూ తెలుసుకున్నది ఏంటంటే.. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఎంత ఫేమస్ చేస్తారో.. ఒక చిన్న తప్పు చేస్తే అంతే కిందకు దించుతారు అనేది.. వీరిని చూస్తే తెలుస్తుంది.
ఇక సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది రమ్య మోక్ష. అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో చిన్నమ్మాయి. అందంతో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపును తెచ్చుకుంది. ఈ వివాదం వలన రమ్య మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతోనే రమ్య.. బిగ్ బాస్ సీజన్ 9 కి వస్తుందని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. కానీ, ఫస్ట్ లో ఆమె రాలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అది గుర్తించిన బిగ్ బాస్ రమ్యను వైల్డ్ కార్డు ఎంట్రీలో దింపాడు.
మొట్ట మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా రమ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ భామకు ఒక స్పెషల్ వీడియోను కూడా చూపించారు. అందులో అమ్మడు తన కెరీర్ ఎప్పుడు మొదలైందో అప్పటినుంచి హౌస్ లోకి అడుగుపెట్టేవరకు అంతా చెప్పుకొచ్చింది. క్షణికావేశంలో తిట్టి తప్పు చేశామని, దానివలన తమ కెరీర్ పోయిందని చెప్పుకొచ్చింది. కెరీర్ మీద ఫోకస్ చేయడానికి హౌస్ లోకి అడుగుపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. వచ్చిరాగానే ఈ చిన్నది ఇంట్లో గొడవలు పెట్టింది. మరి ఈ చిన్నది ఎన్నిరోజులు ఈ హౌస్ లో ఉంటుందో చూడాలి.