Director Teja: హీరోగా.. డైరెక్టర్ తేజ కుమారుడు
ABN, Publish Date - Aug 16 , 2025 | 03:14 PM
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్. బిగ్ స్టార్స్ తమ పిల్లలను పరిచయం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది నటవారసులు తమ క్రేజ్ ను చాటుకుంటే... ఇప్పుడు మరో తరం సందడి చేయడానికి వచ్చేస్తోంది.
సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. నెపోటిజం అంటూ ఎన్ని విమర్శలు వినిపిస్తున్నా.. తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. అలా ఇప్పటికే వచ్చిన బిగ్ స్టార్స్ వారసులు ఇండస్ట్రీని ఏలుతున్నారు. హీరోలు, హీరోయిన్లు , డైరెక్టర్ల పిల్లలు, హాస్య నటుల వారసులు తమ మార్క్ ను చాటుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ కు చెందిన డైరెక్టర్ కొడుకు వెండితెరపై మెరవబోతున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే మెగా, నందమూరి, అక్కినేని కుటుంబాలకు చెందిన వారసులు ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. రీసెంట్ 2025లో నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం వారసుడు ఎన్టీఆర్ ( NTR)వస్తున్నాడు. త్వరలో ఘట్టమనేని వారసులు సందడి చేయబోతున్నారు. జయకృష్ణ (Jaya Krishna) హీరోగా వస్తున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి అమ్మాయి కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు తేజ (Director Teja) ... వైవిధ్య సినిమాలతో పాటు సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తాడు. పైగా కొత్త టాలెంట్ ను పరిచయం చేస్తాడు. ఇప్పటికే చాలా మంది హీరోలను వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు ఏకంగా తన కొడుకును పరిశ్రమకు పరిచయం చేయాలనుకుంటున్నాడు తేజ. దగ్గబాటి రానా (Rana Daggubati) తో 'రాక్షస రాజా' (Rakshasa Raja) సినిమా ప్రకటించి... వార్తల్లో నిలిచాడున తేజ. అయితే ఆ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. కానీ ఇప్పుడు తన కొడుకు అమితోవ్ తేజ్ ( Amitov Teja) ను వెండితెరపై మెరిసేలా చేయాలనుకుంటున్నాడట. ప్రస్తుతం తేజ కొడుకు విదేశాల్లో యాక్టింగ్ లో కోర్స్ లో శిక్ష తీసుకుంటున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఘట్టమనేని రమేశ్ బాబు ( Ramesh Babu) కూతురు భారతి (Ghattamaneni Bharati) ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. భారతి గతంలో గుంటూరు కారంలోని'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పుడు తేజ మూవీలో ఫీమేల్ లీడ్ చేస్తుందన్న వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వారసులను తేజ ఎలా చూపించబోతున్నాడో చూడాలి.
Read also: The Bengal Files Trailer: ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ చూశారా ..
Read also: Akkineni Nagarjuna: జగపతి బాబుకి ఆ పాత్ర ఇస్తే.. మా స్నేహమే పోతుందని చెప్పాను