Dimple Hayathi: ఆశలన్నీ మాస్ మహరాజా పైనే...
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:18 PM
మూడేళ్ళ క్రితం రవితేజ సరసన 'ఖిలాడీ'లో నటించింది డింపుల్ హయతీ. ఇప్పుడు మరోసారి అతనితో జోడీ కట్టింది. ఈ సినిమా సక్సెస్ అయితే డింపుల్ కు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది.
సునీల్ కుమార్ రెడ్డి (Sunil Kumar Reddy) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'గల్ఫ్' (Gulf) మూవీతో నాయికగా తెరంగేట్రమ్ చేసిన డింపుల్ హయతీ (Dimple Hayathi) ఈ మధ్య కాలంలో తన నటనకంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. 2023లో ఓ పోలీస్ ఆఫీసర్ తో తగవు పడిన విషయంలోనూ, కొద్ది నెలల క్రితం ఇంటి పనమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుతోనూ డింపుల్ హయతీ, ఆమె భర్త విక్టర్ డేవిడ్ మీడియాలో కెక్కారు. తెలుగులో రెండేళ్ళ క్రితం గోపీచంద్ (Gopichand) 'రామబాణం' (Ramabhanam) సినిమాలో చివరిగా నటించిన డింపుల్ హయతీకి ఆ తర్వాత మరే సినిమాలోనూ ఛాన్స్ దక్కలేదు. అయితే తాజాగా మాస్ మహరాజా రవితేజ (Raviteja) నటిస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Vignapthi) లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. డింపుల్ హయతీతో పాటు ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) మరో హీరోయిన్.
విశేషం ఏమంటే ఆషికా రంగనాథ్... రవితేజ సరసన నటించడం ఇదే మొదటిసారి కానీ డింపుల్ హయతీ గతంలో రవితేజతో 'ఖిలాడీ' (Khiladi) మూవీలో నటించింది. ఆ సినిమాలో తన గ్లామర్ తో, డాన్స్ తో డింపుల్ ఆడియెన్స్ ను మెప్పించినా... సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన 'రామబాణం' కూడా నిరాశకే గురిచేసింది. దాంతో ఇప్పుడు అమ్మడి ఆశలన్నీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా మీదనే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒక వేళ హిట్ అయితే... డింపుల్ హయతీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఆస్కారం ఉంటుంది. మరికొన్ని అవకాశాలు లభించి, కెరీర్ ఇంకొంతకాలంగా సాఫీగా సాగిపోతోంది. లేకపోతే ఇక కష్టమే. ఎందుకంటే... గడిచిన ఏడెనిమిదేళ్ళలో డింపుల్ తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. బట్ ఎందుకో అక్కడ కూడా తనదైన మార్క్ చూపించలేక పోయింది. సో... 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' మూవీ డింపుల్ కెరీర్ కు లిట్మస్ టెస్ట్ అనుకోవాల్సి ఉంటుంది. చూద్దాం.... ఏం జరుగుతుందో!
Also Read: Nagarjuna: ఇవన్నీ నేనే చేశానా అని షాక్ అవుతుంటా.. ఉలిక్కిపడి లేస్తాను
Also Read: Kaantha: కాంత.. ఆ హీరో బయోపిక్ అంట.. నిజమేనా