Kaantha: కాంత.. ఆ హీరో బయోపిక్ అంట.. నిజమేనా
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:01 PM
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కాంత (Kaantha).
Kaantha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం కాంత (Kaantha). సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ అనగా ఈ సినిమాపై ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కాంత లెజండరీ తమిళ నటుడు ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవిత కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంకేటీ గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. అప్పట్లో ఆయనే మొదటి ఇండియన్ సూపర్ స్టార్. 14 సినిమాలు చేస్తే 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా హరిదాసు అనే సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఒక డైరెక్టర్ తో జరిగిన వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారి పగ తీర్చుకొనేవరకు వెళ్లింది.
ఇక సదురు డైరెక్టర్.. ఒక జర్నలిస్ట్ హత్యను ఎంకేటీ మీద మోపి రెండేళ్ళు జైలుకు పంపాడు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన మరోసారి సినిమాలలో నటించడానికి ప్రయత్నించాడు కానీ, విఫలమయ్యాడు. లగ్జరీ లైఫ్ చూసిన ఎంకేటీ అనారోగ్యంతో 49 ఏళ్లకే మరణించాడు. ఇక ఆయన బయోపిక్ నే కాంత సినిమాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఎంకేటీ గా దుల్కర్ నటిస్తుండగా.. డైరెక్టర్ గా సముద్రఖని నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో దుల్కర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.