Nagarjuna: ఇవన్నీ నేనే చేశానా అని షాక్ అవుతుంటా.. ఉలిక్కిపడి లేస్తాను
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:09 PM
‘ఇప్పుడు 4కే, ఆట్మాస్ వెర్షన్‌లో ‘శివ’ సినిమా చూసి అందరూ ఎంత షాక్ అవుతున్నారో.. మొన్న తొలిసారి ఈ సినిమా చూసి నేనూ అంతే వండర్ అయ్యా. నాకు ఓ కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది’ అని అక్కినేని నాగార్జున అన్నారు
‘ఇప్పుడు 4కే, ఆట్మాస్ వెర్షన్‌లో ‘శివ’ సినిమా చూసి అందరూ ఎంత షాక్ అవుతున్నారో.. మొన్న తొలిసారి ఈ సినిమా చూసి నేనూ అంతే వండర్ అయ్యా. నాకు ఓ కొత్త సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘శివ’. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 36 ఏళ్లు అవుతుంది. అయినా ఇప్పటికీ, ఓ ట్రెండ్‌గా, ట్రెండ్‌సెట్టార్‌గా నిలిచింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో యానివర్శరీ రోజున ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పటి సినిమాను.. ఇప్పటి కొత్త హంగులు విజువల్‌గానూ, సౌండ్ పరంగానూ జోడించి 4కె వెర్షన్‌లో ఈ నెల 14న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘శివ’ విడుదలై 36 ఏళ్లైనా ఇంతటి ప్రేక్షకాదరణ పొందుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా క్రేజ్ ఇప్పుడు కూడా అలాగే ఉందంటే నమ్మశక్యంగా లేదు. సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత మా నాన్న ‘ఇది చాలా పెద్ద హిట్ రా. చాలా బాగా చేశావు. ఈ సినిమా ఎక్కడికి వెళ్లి ఆగుతుందో నాకే తెలియదు’ అని ప్రశంసించారు. ఇప్పుడు నాన్న అన్న మాటలు మళ్లీ గుర్తొచ్చాయి. ఈ సినిమాలో నేను చేసిన ఛేజింగ్ సీన్స్‌ని మళ్లీ చూసినప్పుడు.. తలచుకున్నప్పుడు అప్పుడప్పుడు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుంటా. ఇవన్నీ నేనే చేశానా అని షాక్ అవుతుంటా. ‘శివ’ చిత్రీకరణ రోజుల్ని.. ఈ సినిమా అందించిన జ్ఞాపకాల్ని ఎప్పటికీ మరచిపోలేను. ఆ రోజుల్లో వర్మ ఎంత ఇష్టం, తపనతో ఈ సినిమాకు పనిచేశాడో.. ఇప్పుడు రీ రిలీజ్ కోసం అంతే ప్రేమతో ఆరు నెలలుగా పని చేస్తున్నాడు. ‘శివ’ విడుదలైన రోజుల్లో.. చాలామంది అందులోని సౌండ్ గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీతో దానిని ఇప్పుడు మరింత అద్భుతంగా మార్చాం’ అన్నారు.