సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Devarakonda: పెళ్లి కొడుకు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందే..

ABN, Publish Date - Oct 07 , 2025 | 09:21 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ మధ్యనే హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) తో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం తెల్సిందే.

Vijay Devarakonda

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈ మధ్యనే హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) తో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న విషయం తెల్సిందే. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పైకి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ ఇప్పటివరకు తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇక ఎట్టకేయాలకు అతికొద్ది బంధుమిత్రుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఎంగేజ్ మెంట్ అయ్యాక కూడా ఈ జంట ఆ విషయాన్నీ అంతే సీక్రెట్ గా ఉంచింది.


ఎంగేజ్ మెంట్ అనంతరం విజయ్ దేవరకొండ పుట్టపరి సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి బాబా ఆశీస్సులను అందుకున్నాడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి వద్ద స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఎంగేజ్ మెంట్ తరువాత విజయ్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చేతికి రింగ్ తో.. ముఖంలో పెళ్లి కళతో విజయ్ కళకళలాడుతూ కనిపించాడు.


ఇక నిన్న విజయ్ కారుకు ప్రమాదం చోటుచేసుకున్న విషయం కూడా విదితమే. ఈ ప్రమాదంలో విజయ్ సురక్షితంగా బయటపడ్డాడు. విజయ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం రౌడీ హీరోకు ఒక పెద్ద హిట్ అనేది చాలా అవసరం. లైగర్ నుంచి ఇప్పటివరకు విజయ్ సరైన హిట్ ను అందుకున్నదే లేదు. ప్రజెంట్ విజయ్ చేతిలో రౌడీ జనార్దన్ సినిమా ఉంది. అది షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ విజయాన్ని దక్కించుకుంటాడేమో చూడాలి.

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు.. కుర్రాడిలా ఫోజులిచ్చారు

Dhanush: తెలుగు నిర్మాతలను దోచుకుంటున్న ధనుష్.. ఒక్క సినిమాకు రూ. 50 కోట్లా

Updated Date - Oct 07 , 2025 | 09:21 PM