Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు.. కుర్రాడిలా ఫోజులిచ్చారు
ABN , Publish Date - Oct 07 , 2025 | 08:42 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే విశ్వంభర రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమా సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ రెండు కాకుండా బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. వీటితో పాటు శ్రీకాంత్ ఓదెల సినిమా కూడా లైన్లో ఉంది. అనిల్ సినిమా తరువాత బాబీ సినిమానే పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు చిరు.
ఇక చిరు స్వాగ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. 70 ఏళ్ళ వయస్సులో కూడా ముఖంలో ఆ ఛార్మ్, బాడీలో ఆ స్వాగ్ అస్సలు తగ్గదు. అప్పుడప్పుడు చిరు.. స్పెషల్ గా ఫోటోషూట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా చిరు కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.క్లాస్, మాస్ లుక్స్ లో చిరు కుర్రాడిలా అదరగొట్టేశాడు. సూట్ తో క్లాస్ గా కనిపించినా.. ఫ్లోరల్ షర్ట్ లో మాస్ గా లుక్ ఇచ్చినా.. ఇక రెడ్ కలర్ షర్ట్ లో ఊబర్ కూల్ గా కనిపించినా అది చిరుకే సాధ్యం.ప్రస్తుతం చిరు ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
చిరును ఇలా చూసి అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా అంతే ఛార్మ్ గా ఉన్నాడని కొందరు.. వయస్సు ఇంకా అవ్వలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక చిరు సినిమాలపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
Dhanush: తెలుగు నిర్మాతలను దోచుకుంటున్న ధనుష్.. ఒక్క సినిమాకు రూ. 50 కోట్లా
Karthikeya: కార్తికేయ సినిమాను వదులుకున్న స్టార్ హీరో.. కేవలం ఆ భయంతోనే