Dhanush: తెలుగు నిర్మాతలను దోచుకుంటున్న ధనుష్.. ఒక్క సినిమాకు రూ. 50 కోట్లా

ABN , Publish Date - Oct 07 , 2025 | 07:41 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Dhanush

Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంటున్న ధనుష్ ఈ మధ్యనే ఇడ్లీ కొట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ధనుష్ నే దర్శకత్వం వహించడం విశేషం. అక్టోబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది కానీ, కాంతారను మించిన కలక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది.


ఇక ప్రస్తుతం ధనుష్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఈ స్టార్ హీరో తెలుగు నిర్మాతలను దోచుకుంటున్నాడు అంటూ ఒక వార్త సోషల్ ,మీడియాను షేక్ చేస్తుంది. విషయం ఏంటంటే.. తెలుగులో సార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుష్ ఈ ఏడాది కుబేరతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక తెలుగు నిర్మాత.. ఒక తెలుగు డైరెక్టర్ తో కలిసి ధనుష్ కు కథను వినిపించడానికి చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. కథ నచ్చిన ధనుష్ రెమ్యూనరేషన్ ఏకంగా రూ. 50 కోట్లు అడిగాడట.


ఒక సినిమా హిట్ అయితే స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ పెంచుతారు అన్న విషయం తెల్సిందే. ధనుష్ కూడా అలాగే పెంచి ఉంటాడు అనుకోవచ్చు. కానీ, తమిళ్ లో ధనుష్ ఒక్కో సినిమాకు రూ. 35 కోట్లు అందుకుంటున్నాడట. పెంచితే కనీసం ఒక 5 పెంచి రూ. 40 అయినా అడగాలి కానీ, మరీ రూ. 50 ఏంటి.. అది కూడా తెలుగు సినిమాకు మాత్రమే పెంచడం అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలుగు నిర్మాతలను దోచేయడానికే ధనుష్ సిద్ధమయ్యాడని, తెలుగువారు ఎలా అయినా సినిమాలు చూస్తారు. అందుకని నిర్మాతలు ఎంత అడిగితే అంత ఇస్తారని అనుకుంటున్నాడా.. ? తెలుగు ప్రేక్షకులు ప్రేమతో అన్ని భాషల సినిమాలను ఆదరిస్తారు. వారితో ఆడుకోవడం మాత్రం సరైనది కాదు. తమిళ్లో 35 కోట్లు తీసుకుని, తెలుగులో 50 కోట్లు డిమాండ్ చేయడం అంటే మావారి ప్రేమను వాడుకోవడం అవుతుంది. మన భాష, మన ప్రేక్షకుల గౌరవం కొరకు నిజమైన పట్టు ఉండాలి. ప్రేమ ఇస్తే గౌరవం కూడా ఇవ్వాలి, అది లేకుండా మిగిలేది వ్యాపారం మాత్రమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Neeraja Kona: కాస్ట్యూమ్‌ డిజైనర్‌ టు డైరెక్టర్‌.. ఎలాగంటే..

Karthikeya: కార్తికేయ సినిమాను వదులుకున్న స్టార్ హీరో.. కేవలం ఆ భయంతోనే

Updated Date - Oct 07 , 2025 | 07:45 PM