Chiranjeevi: అత్తయ్య నేర్పిన జీవిత విలువలు ఎప్పటికీ ఆదర్శం
ABN , Publish Date - Aug 30 , 2025 | 11:20 AM
అల్లు అరవింద్ (Allu Aravind) మాతృమూర్తి, చిరంజీవికి Chiranjeevi) అత్తయ్య అయిన అల్లు కనకరత్నమ్మ (94)శుక్రవారం అర్థరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
అల్లు అరవింద్ (Allu Aravind) మాతృమూర్తి, చిరంజీవికి Chiranjeevi) అత్తయ్య అయిన అల్లు కనకరత్నమ్మ (94)శుక్రవారం అర్థరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలుసుకున్న చిరంజీవి, సురేఖ ఉదయాన్నే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగానూ కనకరత్నమ్మకు నివాళి అర్పించారు. అల్లు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. (Allu kanakaratnam is no more)
‘మా అత్తయ్యగారు కీ.శే అల్లు రామలింగయ్యగారి సతీమణి కనకరత్నమ్మగారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ALSO READ: Allu kanakaratnam: అల్లు అరవింద్‌కు మాతృ వియోగం
గత కొంతకాలంగా వృద్థాప్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. కనకరత్నమ్మ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమె పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు.
ALSO READ: Kenisha: రవి మోహన్ ప్రతిభ ప్రపంచానికి తెలియాలి
Joy Crizildaa: గర్భిణిని చేసి మోసం చేశాడు..
Vishal - Dhansika: పెళ్లి ఆలస్యం ఎందుకంటే.. ధన్సిక కూడా సై అంది