సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chennai Mahesh Babu Fans: చెన్నెలో.. మ‌హేశ్ అభిమానుల ర‌క్త‌దానం

ABN, Publish Date - Aug 04 , 2025 | 08:59 AM

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునే రక్తదాతలే రియల్ హీరోలని పలువురు వక్తలు కొనియాడారు.

Chennai Mahesh Babu Fans

ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునే రక్తదాతలే రియల్ హీరోలని పలువురు వక్తలు కొనియాడారు. సెయింట్ థామస్ మౌంట్ నజరేత్పురంలోని చెన్నై మహేష్ బాబు ఫ్యాన్స్ (Chennai Mahesh Babu Fans) ఆధ్వర్యంలో ఈ నెల 9న సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రక్తదాన శిబిరం నిర్వహించారు.

రాఘవ- జయన్ చారి టబుల్ ట్రస్టు ఓఆర్జీ బ్లడ్ గ్రూప్ నిర్వాహకులు, నల్ల బాలి ఉదయకిరణ్, తిరుమలశెట్టి శివసాయి, మాల పాటి వసంత్, కిరణ్కుమార్, కందికట్టి రాహుల్, సీవీ ఎస్ సాకేత్రం, టి. ధనహరి, అనంత్, సి.శ్రీను, వర్మ, లింగబాబు, చైతన్య, హర్ష, శ్రీహర్షతోపాటు 50 మంది కిపై రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వసంత్ మాట్లాడుతూ ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని త‌మ‌ అభిమానాన్ని చూపేందుకు, ప‌లువురికి సాయ‌ప‌డేందుకు రక్తదాన శిబిరం ప్రారంభించిన‌ట్లు నిర్వాహకులు తెలిపారు. థియేటర్లలో చప్పట్ల కంటే ముందుగా వారి జీవితాలను కాపాడే చేతులే మిన్న అని, చేతల ద్వారా నిరూపించిన మహేష్ బాబు గుండె సమస్యలతో ఉన్న 4500 మంది చిన్నారులను ప్రాణం పోసిన రియల్ హీరో అని కొనియాడారు.

Updated Date - Aug 04 , 2025 | 02:23 PM