సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chandini Chowdary: 'సంతాన ప్రాప్తిరస్తు'.. అంటున్న చాందినీ చౌదరి! స్పెషల్ పోస్టర్ విడుదల

ABN, Publish Date - Oct 23 , 2025 | 05:36 PM

చాందినీ చౌదరి నటించిన 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమా నవంబర్ 14న విడుదల కాబోతోంది. అక్టోబర్ 23 ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు.

Santhana prapthirasthu Movie

షార్ట్ ఫిలిమ్స్ నుండి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది చాందినీ చౌదరి (Chandini Chowdary). తెలుగులో పలు చిత్రాలలో ప్రాధాన్యమున్న పాత్రలను పోషిస్తూ వచ్చిన చాందినీ చౌదరి హీరోయిన్ గానూ కొన్ని చిత్రాలలో నటించింది. ముఖ్యంగా 'కలర్ ఫోటో' (Color Photo) ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'గామి', 'డాకూ మహరాజ్' చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన చాందినీ చౌదరి ప్రస్తుతం 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu) మూవీలో నాయికగా నటిస్తోంది. అక్టోబర్ 23 ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్ విషెస్ తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఆమె కళ్యాణి ఓరుగంటి అనే పాత్ర చేస్తోంది. పెళ్ళికూతురుగా ముస్తాబైన పోస్టర్ ను రిలీజ్ చేశారు.


విక్రాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి (Sanjeev Reddy) దీనికి డైరెక్టర్. ఈ చిత్రానికి షేక్ దావూద్ జి స్క్రీన్ ప్లే సమకూర్చారు. 'వెన్నెల' కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్యకృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నవంబర్ 14న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇటీవల దీపావళి సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ను తెలియచేస్తూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.

Also Read: MSG: చిరు సెట్లోకి వెంకీ మామ ఎంట్రీ అదిరింది

Also Read: Friday Tv Movies: శుక్ర‌వారం, అక్టోబ‌ర్ 24,, తెలుగు టీవీ ఛానళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు ఇవే

Updated Date - Oct 23 , 2025 | 06:35 PM