MSG: చిరు సెట్లోకి వెంకీ మామ ఎంట్రీ అదిరింది
ABN , Publish Date - Oct 23 , 2025 | 03:48 PM
చిరంజీవి హీరోగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఈ సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara prasad) చిత్రం ఈ సంక్రాంతికి రానున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. ఈ సినిమాలో కీలక పాత్రలో అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో భాగమయ్యారు.
ఆయనకు వెల్‌కమ్ చెబుతూ చిరంజీవి ఓ ప్రత్యేక వీడియో పంచుకున్నారు. అందులో వెంకటేశ్‌ను చిరంజీవి 'మై బ్రదర్' అని పిలవగా.. ‘చిరు సర్.. మై బాస్’ అంటూ చిరుని వెంకటేష్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సుష్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.