Bhairavam: ఓటీటీలో దూసుకుపోతున్న భైరవం..
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:02 PM
ఈమధ్యకాలంలో థియేటర్ లో సినిమా హిట్ అయ్యిందా లేదా.. అనేదానికన్నా ఓటీటీలో హిట్ అయ్యిందా.. ? లేదా.. ? అనేది ఎక్కువ చూస్తున్నారు.
Bhairavam: ఈమధ్యకాలంలో థియేటర్ లో సినిమా హిట్ అయ్యిందా లేదా.. అనేదానికన్నా ఓటీటీలో హిట్ అయ్యిందా.. ? లేదా.. ? అనేది ఎక్కువ చూస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా ప్లాప్ అవుతుంది. ప్లాప్ సినిమా ఓటీటీలో ఏం హిట్ అవుతుందిలే అనుకుంటే.. అదే దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం భైరవం (Bhiravam) సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas), నారా రోహిత్ (Nara Rohith), మంచు మనోజ్(Manchu Manoj) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటించారు.
కోలీవుడ్ లో చిన్న సినిమాగా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకున్న గరుడన్ సినిమాకు రీమేక్ గా భైరవం తెరకెక్కింది. మే 30న థియేటర్స్‌లో విడుదలై ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా జూలై 18 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. సిల్వర్ స్క్రీన్‌పై అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో భైరవం సినిమా ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
భైరవం కథ విషయానికొస్తే.. గజపతి (మంచు మనోజ్), వరద(నారా రోహిత్) ఇద్దరు ప్రాణ స్నేహితులు. శ్రీను( బెల్లంకొండ శ్రీనివాస్) ఒక అనాధ. చిన్నతనంలో గజపతిని కాపాడడంతో.. అతడిని కూడా ఇంటికి తీసుకొచ్చి సొంత మనవడిగా పెంచుతుంది గజపతి నానమ్మ. ఇక ఆ గ్రామంలో ఉన్న గుడి మాన్యాలకు సంబంధించిన భూమి ఓనర్ ఇక్కడ లేడని, కబ్జా చేసినా ఏమి కాదని ఒక మినిస్టర్.. గజపతితో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ, వరద ఒప్పుకోకపోవడంతో ఆ డీల్ క్యాన్సిల్ అవుతుంది. అయితే డబ్బులేకపోవడంతో జమీందార్ అయిన గజపతి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎలాగైనా మినిస్టర్ ఇచ్చిన డీల్ ను ఫినిష్ చేయాలనీ చూస్తాడు. దానికోసం గజపతి ఏం చేశాడు. ప్రాణ స్నేహితులు గా ఉన్న ఈ ముగ్గురు చివరకు ఏమయ్యారు.. ? అనేది కథ.
ముగ్గురు స్నేహితులుగా నారా రోహిత్, మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ నటనతో ఫిదా చేశారు. ముఖ్యంగా మనోజ్ బేస్ వాయిస్.. ఆ లుక్.. మోహన్ బాబును గుర్తుచేస్తుంది. ఇక సినిమాకు హైలైట్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో భైరవం దూసుకుపోతుంది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Fahadh Faasil - Nazriya Nazim: ఫహాద్- నజ్రియా విడాకులు.. ఒక్క ఫొటోతో క్లారిటీ
Ashwin Kumar-Ramayana: ఇండస్ట్రీని మలుపు తిప్పే సినిమా అవుతుంది..