Fahadh Faasil - Nazriya Nazim: ఫహాద్- నజ్రియా విడాకులు.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ABN , Publish Date - Jul 22 , 2025 | 03:31 PM
ఇండస్ట్రీలో ఉన్న అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. టాప్ 10 లో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil)- నజ్రియా నజీమ్ (Nazriya Nazim) కూడా ఉంటారు.
Fahadh Faasil - Nazriya Nazim: ఇండస్ట్రీలో ఉన్న అడోరబుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే.. టాప్ 10 లో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాసిల్ (Fahadh Faasil)- నజ్రియా నజీమ్ (Nazriya Nazim) కూడా ఉంటారు. బెంగుళూరు డేస్ సినిమా సమయంలో జరిగిన వీరి పరిచయం ప్రేమగా మారి పరిణయం వరకు వెళ్ళింది. నజ్రియా బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టి హీరోయిన్ గా మారింది. తెలుగులో అంటే సుందరానికి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. నజ్రియాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
ఇక ఫహాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతూనే వస్తున్నాయి. ఫహాద్ - నజ్రియా కేవలం నటులుగానే కాకుండా నిర్మాతగా కూడా మారి పలు హిట్ సినిమాలను నిర్మించారు. ఇక ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి జీవితంలో ఎలాంటి మనస్పర్థలు వచ్చాయో ఏమో తెలియదు కానీ, నజ్రియా సోషల్ మీడియా నుంచి సడెన్ గా దూరమైంది.
ఈ మధ్యనే నజ్రియా ఒక క్రిప్టిక్ పోస్ట్ పెట్టింది. అందులో తానెందుకు సోషల్ మీడియాలో కనిపించడమా లేదో.. డిప్రెషన్ లోకి ఎందుకు వెళ్లిందో చెప్పుకొచ్చింది. కొన్నిరోజులు తన మనసు బాలేదని, ఎవరితో మాట్లాడాలనిపించలేదని, తన సినిమా ప్రమోషన్స్ కు కూడా అటెండ్ కాలేదని రాసుకొచ్చింది. తన 30 వ పుట్టినరోజు వేడుకలు కూడా చేసుకోలేకపోయాయని తెలిపింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు నెలకొన్నాయని, విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకే నజ్రియా డిప్రెషన్ లోకి వెళ్లినట్లు రూమర్స్ వచ్చాయి.
ఇక ఫహాద్ - నజ్రియా విడాకుల రూమర్స్ కు చెక్ పడింది. చాలా గ్యాప్ తరువాత ఈ జంట కలిసి కనిపించారు. తాజాగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హృదయపూర్వం. ఈమధ్యనే ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక యువకుడు.. మోహన్ లాల్ దగ్గర మలయాళ హీరో ఫాఫా అంటే ఎంతో ఇష్టమని చెప్పడం, దానికి మోహన్ లాల్ సీరియస్ అవ్వడం సీన్ సెన్సేషన్ గా మారింది. ఇక అది తప్పుగా బయట జనాలు అర్ధం చేసుకోకూడదని మోహన్ లాల్.. ఫహాద్ కుటుంబాలు కలిసి ఒక చిన్న పార్టీ చేసుకున్నాయి.
మోహన్ లాల్ ఇంటివద్దనే ఈ రీయూనియన్ జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో ఫహాద్ తన భార్య నజ్రియాతో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఫహాద్ తమ్ముడు ఫర్హాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటోలలో ఫహాద్ - నజ్రియాను చూసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇద్దరు కలిసే ఉన్నారని, విడాకుల మాట కేవలం పుకార్లే అని క్లారిటీ వచ్చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Varalaxmi Sarathkumar: మొదటి పెళ్లిరోజు.. కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ భర్త
Rajinikanth - Mohan Babu: కోపాన్ని ఎందుకు వదల్లేకపోతున్నావ్..