సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bellamkonda: 'కిల్'తో బెల్లంకొండ

ABN, Publish Date - Jul 16 , 2025 | 06:36 PM

ఒక్క హిట్టు.. ఒకే ఒక్క హిట్టు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు ఆ హీరో అండ్ డైరెక్టర్. కష్టాల్లో ఉన్నవారిని ఓ రీమేక్ కాపీ బాగా ఊరిస్తోంది. ఆ సబ్జెక్టు పట్టుకుంటే పక్కా హిట్ అని ఫిక్స్ అయిపోయారు. అతి త్వరలోనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్‌లో 'కిల్' (Kill) సినిమా గురించి మాట్లాడుకోని మూవీ లవర్ ఉండడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఒక రైలు జర్నీలో జరిగే డ్రామాగా ప్రేక్షకులను కట్టిపడేసింది. లక్ష్య ( Lakshya), రాఘవ్ జుయాల్‌ (Raghav Juyal) తమ నటనతో మాయ చేయగా, దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ ( Nikhil Nagesh Bhat) ఈ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. రాత్రి సమయంలో రైలులోకి దూసుకొచ్చిన దొంగలు, దోపిడీ, హత్యలతో అల్లకల్లోలం సృష్టిస్తే.. ఒక ఆర్మీ ఆఫీసర్ వాళ్ళను ఎదుర్కొని చావు దెబ్బ తీస్తాడు. ఈ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కి, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం లాభాల వర్షం కురిపించింది. థియేటర్లలో హిట్ అయిన ఈ సినిమా, ఓటీటీలోనూ సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సినిమాలోని కొన్ని స్టంట్‌లు నెటిజన్లను ఫిదా చేశాయి. అప్పట్లో ఈ సినిమాను తెలుగు, తమిళంలో రీమేక్ చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ, అప్డేట్స్ ఏమీ రాలేదు. ఇప్పుడు తాజాగా, తెలుగు సినీ వర్గాల్లో ఓ గుసగుస వినిపిస్తోంది.


యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఈ 'కిల్' రీమేక్‌లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. దర్శకుడిగా రమేశ్ వర్మ (Ramesh Varma) పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం రమేశ్ వర్మ, లారెన్స్‌తో 'కాల భైరవ' (Kaala Bhairava) అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. కానీ, ఆ సినిమా కాస్త ఆలస్యం కావొచ్చని, అందుకే ఈ గ్యాప్‌లో 'కిల్' రీమేక్‌ను బెల్లంకొండతో పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. రమేశ్ వర్మ ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

రమేశ్ వర్మ గతంలో 'ఒక ఊరిలో'తో దర్శకుడిగా మొదలై.. 'రైడ్', 'రాక్షసుడు' వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ, 'ఖిలాడీ'తో బోల్తా కొట్టాడు. దీంతో, 'కిల్' రీమేక్‌ను ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడనే చర్చ నడుస్తోంది. 'కిల్' సినిమా అంటే విపరీతమైన హింస, యాక్షన్ , స్టంట్స్ కాంబినేషన్. ఈ హై-ఇంటెన్సిటీ సన్నివేశాలను రమేశ్ వర్మ సమర్థవంతంగా తెరకెక్కిస్తాడా అనే సందేహం కొందరిలో ఉంది. ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఈ యాక్షన్ థ్రిల్లర్ రీమేక్‌కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Also: Tanya Ravichandran: లిప్ లాక్ పెట్టి మరీ ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్

Read Also: Kota Srinivasarao: చిరుతో మొదలు... పవన్ తో ముగింపు...

Updated Date - Jul 16 , 2025 | 06:54 PM