Tanya Ravichandran: లిప్ లాక్ పెట్టి మరీ ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:12 PM
ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా హీరోయిన్స్ రిలేషన్స్ పై రోజుకో వార్త వినిపిస్తూ ఉంటుంది.
Tanya Ravichandran: ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా హీరోయిన్స్ రిలేషన్స్ పై రోజుకో వార్త వినిపిస్తూ ఉంటుంది. ఒక హీరోతోనో, వేరొకరితోనో చనువుగా ఉంటే చాలు వారిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఇండస్ట్రీలో ముద్దుగుమ్మలు కూడా చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. హీరోలతో డేటింగ్ లో ఉన్నా.. ఎఫైర్ నడుపుతున్నా కూడా ఎవరికి తెలియకూడదు అనుకుంటారు.వెకేషన్స్, టూర్స్ అంటూ తిరుగుతూ కెమెరా కంటికి దొరికిపోయినా కూడా అధికారికంగా ప్రకటించకుండా ఆటలు ఆడుతూ ఉంటారు.
అయితే ఇలాంటి పుకార్లు తన మీద రావడం ఎందుకు అనుకున్నదో ఏమో కోలీవుడ్ బ్యూటీ తాన్యా రవిచంద్రన్ తన రిలేషన్ ను అధికారికంగా ప్రకటించింది. కోలీవుడ్ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలిగా ఎంట్రీ ఇచ్చింది తాన్యా. బల్లే వెళ్లాయితేవే అనే సినిమాతో తమిళ్ ఎంట్రీ ఇచ్చిన తాన్యా.. తెలుగులో రాజా విక్రమార్క సినిమాతో పరిచయమైంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చెల్లిగా కనిపించింది. ఇది కూడా అంతగా విజయాన్నిదక్కించుకోలేదు. దీంతో తాన్యా తెలుగుతెరకు దూరమై కోలీవుడ్ లోనే వరుస సినిమాలతో బిజీగా మారింది.
గత కొన్నిరోజులుగా తాన్యా.. డీఓపీ గౌతమ్ జార్జ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపించాయి. దానిపై ఎవరూ అంతగా స్పదించకపోయినా.. మరీ రూమర్స్ ఎక్కువ కాకముందే తమ రిలేషన్ ను కన్ఫర్మ్ చేసింది తాన్యా. ఆఖ్ది కూడా ఘాటు లిప్ లాక్ తో ఉన్న ఫోటోను షేర్ చేసి మరీ చెప్పుకొచ్చింది. గౌతమ్ యూ పెదవి ముద్దు. ఇస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. 'ప్రతి ఫ్రేమ్ దీనికి లీడ్ ఇస్తుంది. ఒక్క ముద్దు.. ఒక్క ప్రమాణం. ఎప్పటికీ ఇలానే' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఏదిఏమైనా రూమర్స్ లేకుండా తాన్యా చేసిన పని బావుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Anasuya: ఆదితో లింకులు.. అందుకే జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయా
For OTT: షార్ట్ ఫిల్మ్ తో మొదలై... ఫీచర్ ఫిల్మ్ గా...