Ghaati Movie: ఘాటీ.. మరో కొత్త డేట్ లాక్..
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:34 PM
లేడీ సూపర్ స్టార్ అనుష్కశెట్టి (Anushka Shetty) .. వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందించింది.
Ghaati Movie: లేడీ సూపర్ స్టార్ అనుష్కశెట్టి (Anushka Shetty) .. వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లు అవుతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్నే అందించింది. ఇక ఆ సినిమా తరువాత అనుష్క ఘాటీ (Ghaati) సినిమాను ప్రకటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది. ఈ చిత్రం విక్రమ్ ప్రభు హీరోగానటిస్తున్నాడు. ఘాటీ కోసమే క్రిష్.. హరిహర వీరమల్లు సినిమాను సైతం వదులుకున్నాడని సమాచారం.
ఇప్పటికే ఘాటీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ, అది అంతకంతకు వెనక్కి వెళ్తూనే ఉంది. అన్ని బావుండి ఉంటే ఘాటీ రిలీజ్ అయ్యి వారం అయ్యేది. జూలై 11 న ఘాటీ రిలీజ్ అవుతుందని మేకర్స్ అధికారికారికంగా ప్రకటించారు. కానీ, కొన్ని కారణాల వలన ఆ రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాకు వాయిదాలు పడడం కొత్తేమీకాదు. ఇప్పటికీ మూడుసార్లు ఘాటీ తన రిలీజ్ డేట్ ను మార్చుకుంది.
ఇక ఈమధ్యనే ఘాటీ మేకర్స్.. తమ సినిమాను ఎంతో ప్రేమిస్తున్నామని.. కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడిందని, ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచడానికి తాము కృషి చేస్తున్నామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ తో వస్తామని తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఘాటీ సెప్టెంబర్ 5 న రిలీజ్ కు సిద్ధమవుతుందని తెలుస్తోంది. జూలై చివరివారం నుంచి ఆగస్టు మొత్తం పెద్ద సినిమాలే ఉన్నాయి. కింగ్డమ్, వార్ 2, కూలీ.. ఇలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి.
సెప్టెంబర్ 25 న ఓజీ, అఖండ 2 సినిమాలు ఉన్నాయి. ఇక మొదటివారం కొద్దిగా ఖాళీ ఉండడంతో సెప్టెంబర్ 5 న ఘాటీ లాక్ చేసిందని టాక్. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. మరి స్వీటీ ఈసారైనా వస్తుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.
War 2: నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం
Rajinikanth, Kamal Haasan: ఈనాటి ఈ బంధమేనాటిదో...