War 2: నెలరోజుల్లో బాక్సాఫీస్ విధ్వంసం
ABN , Publish Date - Jul 16 , 2025 | 02:33 PM
యశ్ రాజ్ ఫిలిమ్స్ 'వార్ -2' నుండి కొత్త పోస్టర్ వచ్చింది. మరో 30 రోజుల్లో మూవీ విడుదల కాబోతున్న సందర్భంగా దీనిని రిలీజ్ చేశారు.
యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'స్పై యూనివర్స్' నుండి రాబోతున్న మరో భారీ బడ్జెట్ మూవీ 'వార్ -2' (War -2). ఇవాళ్టి నుండి సరిగ్గా 30 రోజుల్లో 'వార్ 2' ఆగస్ట్ 14న జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇటు హృతిక్ రోషన్ (Hrithik Roshan), అటు ఎన్టీఆర్ (NTR) నడుమ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తుపాకీ గురిపెడుతూ ఉండటం విశేషం. ఇది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ అని ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ చెప్పకనే చెబుతున్నారు.
విశేషం ఏమంటే... 'వార్ 2' కథానాయిక కియారా అద్వానీ జూలై 16 ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిజానికి ఆమె డెలివరీ ఆగస్ట్ లో జరగాల్సి ఉంది. కానీ నెల రోజుల ముందే బిడ్డను కనేసింది కియారా. 2023లో ఆమె తన సహ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమ వివాహం చేసుకుంది. ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఆస్పత్రిలో కియారా ప్రసవం జరిగింది. తల్లి బిడ్డ ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఉన్న హృతిక్, ఎన్టీఆర్ అభిమానులు ‘వార్ 2’ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ స్పై డ్రామా మరో ముప్పై రోజుల్లో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రాబోతోందని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో రాబోతున్న 'వార్ -2' ఈ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ రిలీజ్‌గా రికార్డులు క్రియేట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Rajinikanth, Kamal Haasan: ఈనాటి ఈ బంధమేనాటిదో...
Also Read: Vijay Sethupathi: నిత్యామీనన్‌తో.. ఇలాంటి సినిమా ఊహించలేదు