Anupama Parameswaran: రంగస్థలం ముందు నేను చేయాల్సింది.. కానీ, సుకుమార్ ..
ABN, Publish Date - Sep 02 , 2025 | 07:34 PM
ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో.. ఎప్పుడు చేజారతాయో చెప్పడం చాలా కష్టం. సినిమా రిలీజ్ అయ్యేవరకు హీరోహీరోయిన్లు ఉంటారు అని చెప్పడం కూడా చాలా కష్టమే.
Anupama Parameswaran: ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తాయో.. ఎప్పుడు చేజారతాయో చెప్పడం చాలా కష్టం. సినిమా రిలీజ్ అయ్యేవరకు హీరోహీరోయిన్లు ఉంటారు అని చెప్పడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నవారందరూ కూడా ఏదో ఒక సినిమాలో రిజెక్ట్ అయినవారే. అయితే కొంతమంది తమ వద్దకు ఆ అవకాశం వచ్చింది అని చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోరు. తాజాగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) తనకు ఒక మంచి ఆఫర్ వచ్చిందని, కానీ, దానిని తాను వదులుకోలేదని చెప్పుకొచ్చింది.
అనుపమ.. కార్తికేయ 2 తరువాత మంచి మంచి సినిమాలను ఎంచుకొని విజయాలను అందుకుంటుంది. టిల్లు స్క్వేర్ తరువాత అమ్మడి రేంజ్ మారిపోయింది. ఇక ఈ మధ్యనే పరదా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన చిత్రాల్లో కిష్కింధపురి ఒకటి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ.. మీడియా తనను ఎలా చూపించిందో చెప్పుకొచ్చింది. రంగస్థలం సినిమాలో సమంత కన్నా ముందు అనుపమనే అనుకున్నారు. ఈ విషయాన్నీ సుకుమార్ స్టేజిమీదనే చెప్పుకొచ్చాడు. అయితే ఆ సినిమాను అనుపమనే కావాలని రిజెక్ట్ చేసిందని.. మీడియా చిత్రించిందని చెప్పుకొచ్చింది. ' రంగస్థలం సినిమాకు ముందు నన్ను అప్రోచ్ అయ్యారు. నేను చేయడానికి కూడా రెడీ అయ్యాను. కానీ, ఆ తరువాత నా ప్లేస్ లో వేరే హీరోయిన్ ను తీసుకున్నారు. అయితే మీడియా మాత్రం అనుపమనే కావాలని సినిమాను రిజెక్ట్ చేసిందని రాసింది. ఆ వార్త చూసి ఆరు నెలలు నాకు పని దొరకలేదు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Samantha: మరోసారి రాజ్ తో సమంత.. కావాలనే హింట్ ఇస్తుందా
Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. హీరోయిన్‌కు రూ.102.55కోట్ల ఫైన్