Samantha: మరోసారి రాజ్ తో సమంత.. కావాలనే హింట్ ఇస్తుందా
ABN , Publish Date - Sep 02 , 2025 | 06:32 PM
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన రెండో పెళ్లిపై కావాలనే హింట్ ఇస్తుందా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన రెండో పెళ్లిపై కావాలనే హింట్ ఇస్తుందా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా సామ్.. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో రిలేషన్ లో ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక రాజ్ భార్య.. వీరిద్దరి గురించి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు వేస్తూనే ఉంది. కానీ, వాటిపై రాజ్ స్పందించింది లేదు.
ఎక్కడకు వెళ్లినా సామ్ వెనుక రాజ్ ఉంటూనే ఉంటున్నాడు. ఇక శుభం సినిమా నిర్మాణంలో అతడిదే పెద్ద హస్తం అని అందరికీ తెల్సిందే. ప్రస్తుతం సమంత.. ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క నిర్మాణంతో బిజీగా మారింది. ఇవి కాకుండా రాజ్ తో రెండో పెళ్ళికి కూడా సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. అందుకే మొదటి నుంచి సామ్.. అందరికి ఇలా హింట్ ఇచ్చి నెమ్మదిగా ట్రోల్ కాకుండా అలవాటు చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నోసార్లు వీరిద్దరూ కెమెరా కంటికి కనిపించారు. కొన్నిసార్లు అయితే సామ్ నే సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.
తాజాగా మరోసారి సామ్.. రాజ్ తో ఉన్న వీడియోని షేర్ చేసింది. సామ్ డిజైనర్ క్రేషా బజాజ్ ఫ్యాషన్ షో దుబాయ్ లో జరుగుతుండగా.. దానికి సామ్ అటెండ్ అయ్యింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సామ్ అభిమానులతో పంచుకుంది. దుబాయ్ ట్రిప్ ను ఒక్క నిమిషంలో చూపిస్తున్నా అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో సామ్.. ఒక వ్యక్తి చెయ్యి పట్టుకొని నవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆ వ్యక్తి కచ్చితంగా రాజ్ నే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. సామ్ - రాజ్ రిలేషన్ చాలా దూరం వెళ్లిందని, త్వరలోనే వీరు రెండో పెళ్లి కబురు చెప్తారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.