Anshu: బికినీ వేసినంత ఈజీ కాదు పాప హిట్ అందుకోవడం
ABN, Publish Date - Jul 20 , 2025 | 06:42 PM
ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల రీఎంట్రీలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు కుర్రకారు గుండెలను తమ అందాలతో కొల్లగొట్టిన హీరోయిన్స్.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అక్కలుగా, వదినలుగా, అమ్మలుగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు.
Anshu: ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోయిన్ల రీఎంట్రీలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒకప్పుడు కుర్రకారు గుండెలను తమ అందాలతో కొల్లగొట్టిన హీరోయిన్స్.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అక్కలుగా, వదినలుగా, అమ్మలుగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నారు. అయితే అవకాశాలు వచ్చినంత ఈజీగా హిట్ కొట్టలేకపోతున్నారు. అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. అందులో అన్షు అంబానీ (Anshu Ambani) ఒకరు. అన్షు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరోయిన్ గా నటించి మెప్పించింది.
అందం, అభినయం కలబోసిన రూపం కావడంతో మొదటి సినిమాతోనే అమ్మడు మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత అన్షు ఇండస్ట్రీని యేలేస్తుంది అనుకున్నారు కానీ, అక్కడ అదేమీ జరగలేదు. మన్మథుడు తరువాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో కనిపించి కనుమరుగైంది. ఆ తరువాత అన్షు ఎక్కడ ఉంది.. ? ఏమైంది అనేది ఎవరికి తెలియలేదు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఇన్స్టాగ్రామ్ లో కనిపించింది. ఆ తరువాత మజాకా సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
మన్మథుడు సినిమాలో ఉన్న రూపం లేకపోయినా.. ఒక మోస్తరుగా అన్షును చూసి మరోసారి ఫ్యాన్స్ మనసు పారేసుకున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఆ రేంజ్ లో ఫిజిక్ ను మెయింటైన్ చేయడం అంటే మాములు విషయం కాదు. అయితే ఈసారి అయినా అన్షు ఇండస్ట్రీని ఏలుతుందేమో అనుకున్నారు. కానీ, ఈసారి కూడా అమ్మడికి వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక మునుపటిలా కాకుండా.. అన్షు ఇండస్ట్రీలో నెగ్గేవరకు వెనక్కి వెళ్లేలా కనిపించడం లేదు. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్లు అన్షు మోడ్రన్ గా మారిపోయి.. అందాల ఆరబోతకు కూడా సై అని హిట్ ఇచ్చేస్తుంది.
తాజాగా అన్షు తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాను షేక్ చేసింది. పింక్ కలర్ బికినీలో బీచ్ ఒడ్డున హొయలు పోతూ కనిపించింది. మొన్నటికి మొన్న బ్లాక్ బికినీలో కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బికినీ వేసినంత ఈజీగా హిట్ ను అందుకోలేవు అమ్మడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు ఎంత పద్దతిగా ఉండేది.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అని చెప్పుకొస్తున్నారు. మరి అన్షు ముందు ముందు తాన్ సత్తా చాటుతుందో లేదో చూడాలి.
Nihar Kapoor: భల్లాలదేవా పాత్ర నేను చేయాల్సింది.. జయసుధ కొడుకు కీలక వ్యాఖ్యలు
Mahesh Babu: సితార కూడా టీనేజర్ అయ్యింది.. నీకెప్పుడు వయస్సు అవుతుంది అన్నా