Mahesh Babu: సితార కూడా టీనేజర్ అయ్యింది.. నీకెప్పుడు వయస్సు అవుతుంది అన్నా
ABN , Publish Date - Jul 20 , 2025 | 04:44 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ముద్దుల తనయ సితార(Sitara) మాత్రం పుట్టగానే ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది.
Mahesh Babu: సాధారణంగా సెలబ్రిటీల పిల్లలు.. పెరిగి పెద్దయ్యాక అభిమానులను సంపాదించుకుంటారు. కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ముద్దుల తనయ సితార(Sitara) మాత్రం పుట్టగానే ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. సితార.. ఈ పేరు తెలియని టాలీవుడ్ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. మహేష్ బాబు - నమ్రతల గారాల పట్టీ. ఘట్టమనేని యువరాణి. సీతూ పాప పుట్టినప్పటి నుంచి మహేష్ పూర్తిగా మారిపోయాడు. ఎక్కడకు వెళ్లినా చిన్నారి సితార ఉండాల్సిందే. ముద్దు ముద్దు మాటలు మాట్లాడే సమయం నుంచే సీతారాను అభిమానులకు పరిచయం చేస్తూ వచ్చింది నమ్రత.
అంతేనా సపరేట్ గా సితారకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ను క్రియేట్ చేసి.. ఆమె ఏం చేసినా.. మహేష్ తో ఎక్కడకు వెళ్లినా నిత్యం అప్డేట్ ఇస్తూ ఉండేది. ఇంకోపక్క సితార యూట్యూబ్ ఛానెల్ ను కూడా క్రియేట్ చేసి అందులో ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి చెప్పుకునే ముచ్చట్లను వీడియో తీసి షేర్ చేసింది. ఇలా సితార తండ్రితాజా పాటు సమానమైన సెలబ్రిటీగా మారింది. తండ్రీ కూతుళ్లు ఎక్కడ ఉంటే అక్కడ రచ్చనే. బాబు కామెడీ టైమింగ్ కి సీతూ పాప చమత్కారం కూడా తోడైతే పక్కన వారు కళ్లు తేలేయడమే.
ఇక నేడు సితార పుట్టినరోజు. గారాల పట్టీ పుట్టినరోజున మహేష్.. ఎంతో స్పెషల్ గా విష్ చేశాడు. ' ఆమె ఒక టీనేజర్ గా మారిపోయింది. హ్యాపీ బర్త్ డే సితార.. నా జీవీతానికి వెలుగువు నువ్వు. లవ్ యూ సో మచ్ ' అంటూ రాసుకొచ్చాడు. దీంతో పాటు ఒక రేర్ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో బ్లూ కలర్ టీ షర్ట్ లో మహేష్ భుజాన అనుకోని సితార నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు సితార టీనేజర్ అయ్యింది. నీకెప్పుడు వయస్సవుతుంది అన్నా .. తండ్రిలా లేవు అన్నలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు SSMB29 తో బిజీగా ఉన్నాడు.