సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rolugunta Suri: గ్రామీణ హృదయాలను తాకబోతున్న ‘రోలుగుంట సూరి'

ABN, Publish Date - Nov 04 , 2025 | 07:05 PM

విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీలు అంటే.. తెలుగు ప్రేక్షకులు ప్రేమలో పడిపోతారు. మానవ సంబంధాల్లోని ఆప్యాయతలను చూపించే కథలపై ఎప్పుడూ మనసు పారేసుకుంటారు.తాజాగా అలాంటి మూవీనే రాబోతోంది.

అద్భుతమైన కథలను చెప్పేందుకు ఆస్కారం ఉండటంతో చాలా మంది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే కోవలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా రాబోతున్నది ‘రోలుగుంట సూరి’ (Rolugunta Suri) మూవీ. టైటిల్ తోనే ఇంట్రెస్టింగ్ గా మారిన ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది.


ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ (Anoop Rubens ) ఫస్ట్ సాంగ్ ను లాంచ్ చేశారు. మంచి పాటలు ఉంటే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి హిట్ చేస్తారని, కథతో పాటు మ్యూజిక్ కూడా బాగుంటే సినిమా బ్లాక్‌బస్టర్ అయినట్టేనని అనూప్ అభిప్రాయపడ్డారు. 'రోలుగుంట సూరి'లో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చే కథతో పాటు దానికి తగ్గట్టే మ్యూజిక్ కూడా ఉందని చెప్పారు. .

'రోలుగుంట సూరీ' మూవీని అనిల్ కుమార్ పల్లా (Anil Kumar Palla) డైరెక్ట్ చేస్తుండగా.. నాగార్జున పల్లా (Nagarjuna Palla) , ఆధ్యారెడ్డి (Aadhya Reddy), భావన నీలప్ (Bhavana Neelap) హీరో-హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు. తెలుగులో ఒక అరుదైన, అద్భుతమైన సినిమాగా ‘రోలుగుంట సూరి’ నిలిచిపోవడం ఖాయమని చిత్రయూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Kamal Haasan: కమల్ బర్త్ డే.. డబుల్ ట్రీట్ రెడీ

Read Also: Shiva 4K Trailer: ఎవడ్రా శివ.. వాడేమైనా దేవుడా.

Updated Date - Nov 04 , 2025 | 07:05 PM