Shiva 4K Trailer: ఎవడ్రా శివ.. వాడేమైనా దేవుడా..
ABN , Publish Date - Nov 04 , 2025 | 06:24 PM
టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చిన సినిమాగా శివ (Shiva)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఏ హీరోను అడిగినా శివ సినిమా చరిత్రనే తిరగరాసింది అని చెప్తారు.
Shiva 4K Trailer: టాలీవుడ్ ఇండస్ట్రీని మార్చిన సినిమాగా శివ (Shiva)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో ఏ హీరోను అడిగినా శివ సినిమా చరిత్రనే తిరగరాసింది అని చెప్తారు. అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), అమల(Amala) జంటగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం శివ. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సంచలనాలను సృష్టించిందో అందరికీ తెలుసు. ఇక ఇప్పడు ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైంది. 4కే ఫార్మాట్ లో సరికొత్తగా శివ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఇక శివ నవంబర్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రీ రిలీజ్ అయినా కూడా కొత్త చిత్రంలానే నాగార్జున- వర్మ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే శివ గురించి ఒక్కో సెలబ్రిటీ మాట్లాడిన వీడియోలను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. తాజాగా శివ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ముందు శివ గురించి టాలీవుడ్ స్టార్స్ ఏం అన్నారో.. ఆ సినిమాపై వారు ఎలాంటి రివ్యూ ఇచ్చారో ఆ వీడియోలను ఎటాచ్ చేశారు.
దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు , ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ , మణిరత్నం, శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్ .. ప్రతి ఒక్కరు శివ ఒక ఐకానిక్ చిత్రమని, కచ్చితంగా ఇండస్ట్రీ శివకు ముందు.. శివకు తరువాతని చెప్పొచ్చని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు అయితే శివను 10 సార్లు చూసినట్లు తెలిపాడు. అల్లు అర్జున్ శివ ఇండియన సినిమా హిస్టరీలోనే ఐకానిక్ చిత్రమని చెప్పుకొచ్చాడు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. శివ ఒక కాలేజ్ స్టూడెంట్. ఫ్రెండ్స్ తో అల్లరిగా తిరిగే కుర్రాడు. కాలేజ్ లో జేడీ అనే స్టూడెంట్ లీడర్ భవానీ అనే రౌడీ కింద పనిచేస్తూ కాలేజ్ లో అందరినీ భయపెడుతూ ఉంటాడు. శివకు - జేడీకి జరిగిన గొడవ భవానీ వరకు వెళ్తుంది. జేడీపై చెయ్యి చేసుకోవడంతో కాలేజ్ ఎన్నికల్లో శివను స్టూడెంట్ లీడర్ గా ఎన్నుకుంటారు. ఇలా శివ .. భవానీకి సంబంధించిన ప్రతి విషయంలో అడ్డు పడుతుంటాడు. దీంతో శివను చంపడానికి భవానీ ప్లాన్ చేస్తాడు. మరి ఆ అప్లను సక్సెస్ అయ్యిందా.. ?భవానీ వెనుక ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరు.. ? శివ. స్టూడెంట్ లీడర్ గా మారాడా.. ? ఆశతో అతనికున్న సంబంధం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Globetrotter: సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ.. మాములుగా లేదుగా
Kaantha First Spark: అదిరిపోయిన కాంత ఫస్ట్ స్పార్క్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే