Kamal Haasan: కమల్ బర్త్ డే.. డబుల్ ట్రీట్ రెడీ

ABN , Publish Date - Nov 04 , 2025 | 06:50 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan).. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే గుర్తింపు ఉన్న స్టార్ హీరోలు. వీరి సినిమాలు వచ్చాయంటే అభిమానులకు పండగే.

Kamal- Rajini

Kamal Haasan: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan).. సౌత్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే గుర్తింపు ఉన్న స్టార్ హీరోలు. వీరి సినిమాలు వచ్చాయంటే అభిమానులకు పండగే. మామూలుగా వీరిలో ఏ ఒక్కరి సినిమా విడుదలైనా సందడి ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఈ హీరోలిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడా కల నిజం కాబోతోంది. ఈ దిగ్గజ నటులు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు గతంలోనే ప్రచారం జరిగింది. అందరూ అది సాధ్యం కాదేమో అనుకున్నారు. కానీ అది ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది.


ఈ ఇద్దరు స్టార్ హీరోలను కలిపే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు.. ఎవరు.. అని చలా చర్చలు జరిగాకా.. ఆ ఛాన్స్ ను నెల్సన్ దిలీప్ కుమార్ పట్టేసాడని తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, రజనీకాంత్ తదుపరి రెండు చిత్రాలు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ(Kamal Haasan Production)లోనే చేయబోతున్నాడట. మొదటి చిత్రం కాస్త మోడరేట్ బడ్జెట్లో రూపొందనున్న ఎంటర్టైనర్అని, దీనికి సుందర్ సి (Sundar C) దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో చిత్రంగా రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ తెరకెక్కనుంది.


ఇప్పటికే నెల్సన్.. రజినీకాంత్ తో జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానుంది. ఇక దీని తరువాత నెల్సన్ పూర్తిగా ఈ మల్టీస్టారర్ కథ మీదనే ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం రజినీ- కమల్ మల్టీస్టారర్ కి సంబంధించిన అనౌన్స్ మెంట్.. నవంబర్ 7 న రానుందని తెలుస్తోంది. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రజినీ - కమల్ సినిమాను అధికారికంగా వెల్లడించి కమల్ కు బర్త్ డే విషెస్ చెప్పాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు రజినీ- సుందర్ సి సినిమాను కూడా కమల్ నే నిర్మిస్తుండడంతో ఆ అప్డేట్ కూడా అదే రోజు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన రెండు పెద్ద అప్డేట్స్ నవంబర్ 7 న వస్తుండడంతో అటు రజినీ ఫ్యాన్స్.. ఇటు కమల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Shiva 4K Trailer: ఎవడ్రా శివ.. వాడేమైనా దేవుడా..

Theater Movies: ఈ వారం, Nov 7.. దేశ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న సినిమాలు

Updated Date - Nov 04 , 2025 | 06:50 PM