సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anirudh Ravichander: బక్కోడా.. ఒక్క మాటతో గుండెలను పిండేశావ్ కదరా

ABN, Publish Date - Jul 28 , 2025 | 09:36 PM

అభిమానులందు తెలుగు అభిమానులు వేరయా అని చెప్తే అతిశయోక్తి అస్సలు అనిపించదు. భాషా బేధం లేకుండా.. రంగురూపు చూడకుండా.. చిన్నా పెద్ద అస్సలు పట్టించుకోకుండా కథ నచ్చితే హిట్ చేస్తారు.

Anirudh Ravichander

Anirudh Ravichander: అభిమానులందు తెలుగు అభిమానులు వేరయా అని చెప్తే అతిశయోక్తి అస్సలు అనిపించదు. భాషా బేధం లేకుండా.. రంగురూపు చూడకుండా.. చిన్నా పెద్ద అస్సలు పట్టించుకోకుండా కథ నచ్చితే హిట్ చేస్తారు. హీరో నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. ఒక్కసారి కనుక అభిమానిగా మారితే పోయేవరకు వారి గుండెల్లోనే ఉంచుకుంటారు. అది తెలుగువారి అభిమానం. అందుకే ఎన్ని ఇండస్ట్రీలో ఉన్న ఏ ఒక్క స్టార్ ను అడిగినా చెప్తారు.. తెలుగువారి అభిమానం గురించి. కేవలం హీరోలను మాత్రమే అభిమానిస్తారేమో అనుకుంటారు. తెలుగువారికి ఎవరైనా నచ్చారు అంటే.. వారిని సింహాసనం మీద కూర్చోబెడతారు.


ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే అప్పుడప్పుడు కనిపించడం తప్ప ప్రమోషన్స్ లో కనిపించేవారు కాదు. కానీ, ఇప్పుడు అలా కాదు.. మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్ట్ గా మ్యూజిక్ కన్సర్ట్ ఏర్పాటుచేసి సినిమాలోని సాంగ్స్ ను పాడి వినిపిస్తున్నారు. అలా ప్రమోషన్స్ లో ఎక్కువ కనిపించే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. కోలీవుడ్ ను తన మ్యూజిక్ తో షేక్ ఆడించిన అనిరుధ్ ఈ మధ్య తెలుగు సినిమాలతో బిజీగా మారాడు. తెలుగువారు అనిరుధ్ కు ముద్దుగా బక్కోడు అని పేరు పెట్టిన విషయం కూడా తెల్సిందే.


ప్రస్తుతం అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రాల్లో కింగ్డమ్ ఒకటి. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ నేడు కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో బక్కోడు.. తన హిట్ సాంగ్స్ పాడి రచ్చ రేపాడు.


ఇక ఈ ఈవెంట్ లో అనిరుధ్.. తెలుగువారు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అది కూడా తెలుగు నేర్చుకొని మరీ అనిరుధ్.. వారి ప్రేమకు థాంక్స్ చెప్పుకొచ్చాడు. ' కింగ్డమ్ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డాం. ముఖ్యంగా నాగవంశీ.. నా నుంచి వచ్చే ప్రతి సాంగ్ కోసం నాగవంశీ ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ సినిమాలో నటించిన భాగ్యశ్రీ, సత్యదేవ్, వెంకటేష్ అందరూ చాలా బాగా చేశారు. ఇక రౌడీ హీరో విజయ్ గురించి చెప్పాలి. సాధారణంగా ఏ హీరో అయినా రిలీజ్ ఇంకో వారంలో ఉంది అంటే వర్క్ ఫినిష్ చెయ్ అని చెప్తారు. కానీ, వీడీ నాకు పెద్ద మెసేజ్ చేశాడు. వర్క్ తో పాటు హెల్త్ కూడా ముఖ్యమే. రెస్ట్ తీసుకో అని పంపాడు. అది విజయ్ పెద్ద మనసు.


కింగ్డమ్ సినిమా.. నాకే కాదు గౌతమ్ కు, విజయ్ కు, నాగవంశీకి కెరీర్ మైల్డ్ స్టోన్ సినిమా అని చెప్పొచ్చు. ఇక ఇక్కడకు వచ్చిన అభిమానుల గురించి చెప్పాలి. 13 ఏళ్ల క్రితం నా మొదటి సినిమా 3 రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి వారు నాపై ప్రేమను చూపిస్తూనే ఉన్నారు. నా తెలుగు ఫ్యామిలీ నన్ను మీ అబ్బాయిగా దత్తత తీసేసుకున్నారు. నన్ను మీ వాడిని చేసుకున్నారు. మీరు నా వాళ్లు అయ్యిపోయారు. ఎప్పటికీ నేను మీ అనిరుధ్ నే.. బక్కోడినే ' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిరుధ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలు విన్న తెలుగు అభిమానులు బక్కోడా.. ఒక్క మాటతో గుండెలను పిండేశావ్ కదరా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Avatar 3: అవతార్‌3 ట్రైలర్ వ‌చ్చేసింది.. ఈ సారి అంత‌కు మించి

Telusu Kada: మల్లిక గంధ.. నచ్చేసిందోయ్

Updated Date - Jul 28 , 2025 | 09:36 PM