సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Sirish: హిట్ కోసం రూట్ మార్చిన అల్లు వారబ్బాయి

ABN, Publish Date - Sep 03 , 2025 | 04:32 PM

అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish).. ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.

Allu Sirish

Allu Sirish: అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ (Allu Sirish).. ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కెరీర్ మొదట్లో ఒకటి, రెండు సినిమాలు ఒక మోస్తరుగా విజయాన్ని అందుకున్నా.. ఆ తరువాత పరాజయాల పరంపరలోనే కొనసాగాడు.మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని గతేడాది బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. బడ్డీ తరువాత అల్లు శిరీష్ ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రకటించింది లేదు.


ఇక అందుతున్న సమాచారం ప్రకారం శిరీష్.. హిట్ కోసం రూట్ మార్చాడని తెలుస్తోంది. ఇప్పటివరకు యాక్షన్ సినిమాలతో చేతులు కాల్చుకున్న ఈ కుర్ర హీరో.. ఇప్పుడు చక్కగా కామెడీ ఎంటర్ టైనర్లు చేసుకుంటూ పోవాలని నిర్ణయించుకున్నాడట. ఒకరకంగా ఇది సేఫ్ గేమ్ అని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా ఫ్యామిలీ సినిమాలు చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు శిరీష్ కూడా ఈ సూత్రాన్నే ఒంటపట్టించుకున్నాడని టాక్.


ఇక అందులో భాగంగానే శిరీష్.. డైరెక్టర్ సుబ్బుతో చేతులు కలిపాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేసి మంచి డైరెక్టర్ అనిపించుకున్న సుబ్బు.. నరేష్ తో బచ్చలమిల్లి తెరకెక్కించి ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ రాసుకున్నాడట. ఆ కథనే శిరీష్ కి వినిపించగా.. బాగా ఇంప్రెస్ అయ్యాడని, త్వరలోనే పట్టాలెక్కిద్దామని చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను శిరీష్ అధికారికంగా ప్రకటించనున్నాడు. మరి ఈ సినిమాతోనైనా శిరీష్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Ileana D'cruz: అది నా అదృష్టం.. త్వరలోనే మీ ముందుకు వస్తా

Balakrishna: థమన్ కు కలిసొచ్చిన నిర్ణయం

Updated Date - Sep 03 , 2025 | 04:32 PM