Ileana D'cruz: అది నా అదృష్టం.. త్వరలోనే మీ ముందుకు వస్తా
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:37 PM
టాలీవుడ్ లో ఇలియానా డిక్రూజ్ (Ileana D'cruz) కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.
Ileana D'cruz: టాలీవుడ్ లో ఇలియానా డిక్రూజ్ (Ileana D'cruz) కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలియానా నడుము అనే ట్యాగ్ లైన్ ను క్రియేట్ చేసింది ఆమెనే. ఇప్పటికీ ఎవరి నడుమైన సన్నగా ఉంది అంటే అందరూ ఇలియానా నడుము అని చెప్పుకొస్తారు. అయితే పెళ్లి తరువాత ఇలియానాలో చాలా మార్పులు వచ్చాయి. సన్నగా ఉన్న ఇలియానా బొద్దుగా మారింది. ఆ తరువాత సినిమాలకు టాటా చెప్పింది. అంతేనా అభిమానులకు షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. పెళ్ళికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చి మొదటిసారి షాక్ ఇచ్చింది.
మొదటి బిడ్డకు జన్మనిచ్చాక ఇలియానాపై చాలా విమర్శలు వచ్చాయి. అయినా ధైర్యంగా సోషల్ మీడియాలో బిడ్డ ఫోటోలు షేర్ చేసి.. తన హ్యాపీనెస్ ను అభిమానులతో పంచుకుంది. ఇక ఆ తరువాత తన భర్త డోలన్ ను పరిచయం చేసింది. పెళ్లి ఎప్పుడు ఎలా జరిగింది చెప్పకుండా రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించి మరో షాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో ఇలియానా ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతుంది. తల్లి అయ్యాకా ఇలియానా సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమె తన రీఎంట్రీపై స్పందించింది. తాను సినిమా లైఫ్ ను మిస్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.
' ప్రస్తుతం ఇద్దరు పిల్లల సంరక్షణ చూసుకుంటూ బిజీగా ఉన్నాను. వీరిని చూసుకుంటూనే సినిమాలు కూడా చేయాలి అని నేను తొందరపడటం లేదు. అయితే సినిమాలు మాత్రం చేస్తాను. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నా అభిమానులు నన్ను మిస్ అవుతున్నారు అన్న విషయం కూడా తెలుసు. నేను కూడా షూటింగ్ లైఫ్ ను మిస్ అవుతున్నాను. సెట్ లో సందడి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడం.. నా కెరీర్ లో నేను ఎంతోమంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు సినిమాలు చేయాలనీ ఉంది. కానీ, సినిమాల కంటే తల్లి పాత్ర చాలా ముఖ్యమైంది. దానికే ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. కచ్చితంగా త్వరలో అందరి ముందుకు వస్తాను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Puri Jagannadh: పూరీ, ఛార్మి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన
Mahavatar Narsimha: తనువు మోసిన ప్రాణమా.. వీడియో సాంగ్ వచ్చేసింది