సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Naga Chaitanya: ఆ సినిమా చేయకూడదని చాలా ప్రయత్నించా.. కానీ వదల్లేదు

ABN, Publish Date - Oct 06 , 2025 | 03:52 PM

అక్కినేని నట వారసుడిగా జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య (Naga Chaitanya).

Akkineni Naga Chaitanya

Akkineni Naga Chaitanya: అక్కినేని నట వారసుడిగా జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య (Naga Chaitanya). మొదటి సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా మంచి నటుడు అనిపించుకున్నాడు. ఆ తరువాత విజయాపజయాలను పక్కన పెట్టి సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదుగుతూ వస్తున్నాడు. తండేల్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన చై.. ప్రస్తుతం NC24 సినిమాతో బిజీగా మారాడు. ఇక చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చే చై.. జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా విచ్చేసి ఎన్నో ఆసక్తికరమైన కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు.


అక్కినేని, దగ్గుబాటిల వారసుడిగా పెరగడం, కాలేజ్ కబుర్లు, పరాజయాలు, అవమానాలు.. ఇలాప్రతి విషయాన్నీ కూడా చై ఈ షోలో చెప్పుకొచ్చాడు. ఇక తన కెరీర్ లోనే గురుండిపోయే క్యారెక్టర్ అంటే మహానటి సినిమాలో తాత ఏఎన్నార్ పాత్ర చేయడమే అని చెప్పుకొచ్చిన చై.. ఆ సినిమా చేయకుండా ఉండడానికి చాలా ప్రయత్నించానని చెప్పుకొచ్చాడు. కానీ, నాగ్ అశ్విన్ అస్సలు వదల్లేదని, అందుకే చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ' నాగీ, నేను చాలా మంచి ఫ్రెండ్స్. మహానటి సినిమా చేస్తున్నప్పుడు అందులో తాతగారి పాత్ర నన్ను చేయమని అడిగాడు. నేను నో చెప్పా. ఆయనలా చేయడం ఎవరివల్ల కాదు. అది అసాధ్యం.


ఆ సినిమా చేయకుండా ఉండడానికి నేను చాలా ప్రయత్నించాను. అదే సమయంలో సవ్యసాచి చేస్తున్నా. అప్పుడు నాకు గడ్డం ఉంది. అదే విషయాన్నీ చెప్పి తప్పించుకోవాలనుకున్నాను. నాగీ.. ఈ సినిమా చేస్తున్నా.. దీనికి గడ్డం కావాలి. నేను తాతగారి పాత్ర చేయలేను అని చెప్పాను. నాగీ అప్పుడు వెళ్ళిపోయి నెల తరువాత వచ్చాడు. నా గడ్డాన్ని విఎఫ్ఎక్స్ లో తీసేసి.. హెయిర్ పెట్టి చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు. నేను షాక్ అయ్యాను. బయట గడ్డం లేకుండా ఎలా ఉంటానో అచ్చు అలానే ఉంది. కచ్చితంగా ఈ పాత్ర నువ్వే చేయాలి చై అన్నాడు. దాంతో ఓకే అనేశాను.


ఆ తరువాత నాకే అనిపించింది. నేను చేయకపోతే తాత పాత్రలో మరొక నటుడు చేసేవాడు. తాత పాత్రలో వేరేవాళ్లు చేయడానికి నా మనసు అంగీకరించదు. నేనుండగా తాత పాత్ర ఇంకెవరో ఎందుకు చేయాలి అనిపించింది. ఆయన పాత్ర చేయడం నా అదృష్టంగా భావిస్తాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చై వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Srinidhi Shetty: ఆ హీరోలతో సినిమా.. రాత్రింబవళ్లు కష్టపడతా

Mahesh Babu: బాబు డెడికేషన్‌ అలా ఉంటాది మరి..

Updated Date - Oct 06 , 2025 | 03:53 PM