Mahesh Babu: బాబు డెడికేషన్‌ అలా ఉంటాది మరి..

ABN , Publish Date - Oct 06 , 2025 | 02:14 PM

‘బాబు డెడికేషన్‌ అలా ఉంటాది మరి అంటున్నారు’ మహేశ్‌ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్‌. ఈ ప్రశంసలకు కారణం కృష్ణ వంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ. అందులో ఆయన చెప్పుకొచ్చిన విశేషాలు.

‘బాబు డెడికేషన్‌ అలా ఉంటాది మరి అంటున్నారు’ మహేశ్‌ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్‌. ఈ ప్రశంసలకు కారణం కృష్ణ వంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ. అందులో ఆయన చెప్పుకొచ్చిన విశేషాలు. ‘మురారి’ (Murari) మహేష్‌ బాబు కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ సినిమా. కృష్ణ వంశీ (Krishna vamsi) దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది. ఇటీవల ఈ సినిమాను రిలీజ్‌ చేస్తే అభిమానులు సెలబ్రేట్‌ చేసుకున్నారు. థియేటర్లలతో పెళ్లి వాతావరణాన్ని క్రియేట్‌ చేశారు. పలు థియేటర్స్‌లో అక్షింతలు పంచుకుంటూ పెళ్లి సీన్‌ రాగానే అక్షింతలు చల్లారు. అయితే ఈ సినిమాలో ఓ ఫైట్‌ సీన్‌ కోసం మహేశ్‌ చాలా కష్టపడ్డారట. ఆరోగ్యం బాలేకున్నా సినిమా కోసం షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ విషయాన్ని తాజాగా కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పగా ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతోంది.  

Murari.jpg
ఇందులో  'మురారి' పెంచుకునే ఏనుగును రవిబాబు కిడ్నాప్‌ చేయడం, దానిని కాపాడే తరుణంలో విలన్స్‌ తో మహేష్‌ ఫైట్‌ చేసే సీన్‌ ఉంటుంది. గోదావరి నీటిలో ఈ ఫైట్‌ సీన్‌ ఉంటుంది. అయితే ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ చేేస సమయంలో మహేష్‌కు తీవ్ర జ్వరమట. అయినా గానీ. అంత  జ్వరంతో కూడా మహేష్‌ ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ చేశాడట. అయితే ఈ ఫైట్‌కు ముందు ఓ సాంగ్‌ ఉంటుంది. ఈ సాంగ్‌ కూడా నీళ్లలోనే ఉంటుంది. జ్వరాన్ని సైతం లెక్కచేయకుండా, షెడ్యూల్‌ మిస్‌ చేయకుండా మహేష్‌ ఆ షూటింగ్‌ చేశారట. ఈ విషయాన్ని కృష్ణ వంశీ చెప్పారు. ఈ వీడియో చూసిన అభిమానులు బాబు డెడికేషన్‌ అలా ఉంటుంది మరి’ అంటూ  కామెంట్స్‌ చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ప్రస్తుతం రాజమౌళి చిత్రంతో బిజీగా ఉన్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 చిత్రీకరణ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. అలాగే కొందరు స్టార్లు కూడా ఈ చిత్రంలో నటించనున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలనీ, 120కి పైగా దేశాల్లో సినిమాను రిలీజ్‌ చేయాలని రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఈ చిత్రానికి యూనివర్శెల్‌ సబ్జెక్ట్‌ తీసుకున్నారు. నవంబర్‌లో మహేష్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయనున్నారు.  

Updated Date - Oct 06 , 2025 | 02:14 PM