Srinidhi Shetty: ఆ హీరోలతో సినిమా.. రాత్రింబవళ్లు కష్టపడతా
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:13 PM
న్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
srinidhi shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమా తరువాత అమ్మడిని పట్టుకోవడం ఎవరితరం కాదు అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్లు విక్రమ్ లాంటి హీరో సరసన చేసే ఛాన్స్ అయితే వచ్చింది కానీ, విజయం మాత్రం దక్కలేదు. ఆ తరువాత అడపాదడపా సినిమాల్లో కనిపించినా అవేమి అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు.
ఇక ఆ సమయంలోనే శ్రీనిధి తెలుగులో హిట్ 3 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. నిజం చెప్పాలంటే తెలుసు కదా సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా.. దానికన్నా ముందు హిట్ 3 రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడు స్టార్ గా మారింది. ఇక ఇప్పుడు తెలుసు కదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం తెలుసు కదా. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తెలుసు కదా సినిమా అక్టోబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. తాజాగా శ్రీనిధి శెట్టి ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది. టాలీవుడ్ లో తనకు ఏ హీరోలతో వర్క్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చింది. ఏ నటికి అయినా కొందరు స్టార్స్ తో చేయాలనీ ఆశ ఉంటుంది. ఒకేసారి ఇద్దరు ఫేవరేట్ స్టార్స్ తో చేసే ఛాన్స్ వస్తే ఎవరితో చేస్తారు అన్నప్పుడు.. తప్పక.. మనసు ఒప్పుకోకపోయినా ఎవరో ఒకరి పేరు చెప్తారు. కానీ, శ్రీనిధి మాత్రం ఎందుకు ఇద్దరితో చేయకూడదు అని ప్రశ్నించింది.
ఒకేసారి మీకు మహేష్ బాబు, ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వస్తే మీరు ఎవరితో చేస్తారు అన్న ప్రశ్నకు శ్రీనిధి మాట్లాడుతూ.. 'ఎందుకు నా అవకాశాలను తక్కువ చేస్తున్నారు. నాకు ఇద్దరూ కావాలి. ఇద్దరి మూవీస్ చేస్తా. డేట్స్ అడ్జెస్ట్ చేసుకొని ఒకరిది డే షిఫ్ట్.. ఇంకొకరిది నైట్ షిఫ్ట్ చేస్తా.. రాత్రింబవళ్లు కష్టపడి డబుల్ షిఫ్ట్ చేస్తా' అని చెప్పుకొచ్చింది. ఇక శ్రీనిధి డెడికేషన్ లెవెల్ చూసి అభిమానులు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mahesh Babu: బాబు డెడికేషన్ అలా ఉంటాది మరి..
Rama Satyanarayana: శరవేగంగా 'మహానాగ' షూటింగ్...