Lenin: అయ్యగారి 'లెనిన్' ఆగిందా
ABN, Publish Date - Aug 03 , 2025 | 10:16 PM
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఏజెంట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న అఖిల్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Lenin: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఎన్నో ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ఏజెంట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న అఖిల్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే అఖిల్ నటిస్తున్న చిత్రం లెనిన్(Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నాడు. మొదటి ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీల నటించనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ గ్లింప్ కూడా రిలీజ్ చేశారు. అయితే మధ్యలో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తుందని వార్తలు వచ్చాయి.
లెనిన్ పై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పరువు హత్యల నేపథ్యంలో నడిచే కథతో పాటు ఆలయాలమధ్య జరిగే వివాదాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నారట. ఇక ఈ ఏడాదిలోనే పెళ్లితో ఒక ఇంటి వాడైన అఖిల్ లక్ మారబోతుందని వార్తలు వచ్చాయి. పెళ్లి తరువాత హనీమూన్ కూడా వెళ్లకుండా అయ్యగారు లెనిన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని టాక్ నడిచింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం లెనిన్ షూటింగ్ ఆగిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా లెనిన్ షూటింగ్ అప్డేట్ ఎక్కడా వినిపించడం లేదు. కొన్ని కారణాల వలన లెనిన్ షూటింగ్ కొన్నిరోజులు వాయిదా పడిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకు హీరోయిన్ కారణమని కొందరు అంటుండగా.. బడ్జెట్ కారణమని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు లెనిన్ రిలీజ్ డేట్ గురించి కానీ, షూటింగ్ అప్డేట్ గురించి కానీ ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించింది లేదు. అఖిల్ పెళ్లి తరువాత లెనిన్ సెట్స్ మీదకు వెళ్లినట్లు దాఖలాలు కూడా లేవు. అందుకే అక్కినేని అభిమానులకు అసలు లెనిన్ షూటింగ్ జరుపుకుంటుందా ..? అనే కొత్త అనుమానం మొదలైంది. మరి ఈ అనుమానంలో నిజమెంత అనేది తెలియాలంటే అయ్యగారు కానీ, మేకర్స్ కానీ ఏదైనా అప్డేట్ ఇచ్చేవరకు ఆగాల్సిందే.
3BHK: ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రతి మధ్యతరగతి తండ్రి కథ
Akira Nandan: 'ఓజీ' లో పవన్ వారసుడు.. ఇదిగో ప్రూఫ్