3BHK: ఓటీటీలో దుమ్మురేపుతున్న ప్రతి మధ్యతరగతి తండ్రి కథ

ABN , Publish Date - Aug 03 , 2025 | 09:35 PM

కొన్ని సినిమాలు చూస్తే మన జీవితంలో జరిగిన కథలలా అనిపిస్తాయి. అలాంటి కథలు థియేటర్ నుంచి బయటికి వచ్చినా కూడా మన వెంట వస్తూనే ఉంటాయి. వాటిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు.

3BHK

3BHK: కొన్ని సినిమాలు చూస్తే మన జీవితంలో జరిగిన కథలలా అనిపిస్తాయి. అలాంటి కథలు థియేటర్ నుంచి బయటికి వచ్చినా కూడా మన వెంట వస్తూనే ఉంటాయి. వాటిని మర్చిపోవడం అంతా ఈజీ కాదు. ఈ మధ్యకాలంలో అంతలా ప్రేక్షకుల్ని వెంటాడిన కథలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. అలాంటి కథల్లో ఒక కథ 3 BHK.సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్, దేవయాని, మీథా రఘునాథ్, చైత్ర జై ఆచార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 3 BHK. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 4న రిలీజ్ అయి మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది.


ఒక మధ్యతరగతి తండ్రి ఏకైక కల.. సొంత ఇల్లు కొనడం. దానికోసం ఆ తండ్రి ఎన్ని అవమానాలు భరించాడు..? తండ్రి బాధను తట్టుకోలేని కొడుకు ఎలా తండ్రి కోరికను నెరవేర్చాడు ..? అనేది సినిమా కథగా చూపించారు. అయితే కొన్ని సినిమాలు థియేటర్లో కన్నా ఓటీతీలో మరింత గుర్తింపును సంపాదించుకుంటాయి. తాజాగా 3BHK సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లో అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమాలో ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుంది. సోషల్ మీడియా మొత్తం ప్రస్తుతం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అతిశయోక్తి కాదు.


ఇక 3BHK కథ విషయానికొస్తే.. వాసుదేవన్ (శరత్‌కుమార్) ఒక లోయర్-మిడిల్ క్లాస్ ఫ్యాక్టరీ క్లర్క్, అతని భార్య శాంతి (దేవయాని), కొడుకు ప్రభు (సిద్ధార్థ్), కూతురు ఆర్తి (మీథా రఘునాథ్)తో కలిసి అద్దె ఇళ్లలో తిరుగుతూ జీవిస్తుంటాడు. వాసుదేవన్ జీవితంలో ఒకే ఒక కల - సొంతంగా 3BHK ఇల్లు కొనాలి. కానీ, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఖర్చులు - ప్రభు చదువు, ఆర్తి పెళ్లి, వైద్య అత్యవసర పరిస్థితులు - వారి ఆశలను పదేపదే దెబ్బతీస్తాయి. ప్రభు తన తండ్రి కలను నెరవేర్చేందుకు చదువులో, తర్వాత ఉద్యోగంలో ప్రయత్నిస్తాడు, కానీ అతని అంతంత మాత్రం చదువు తనని ఐటీ రంగంలోకి నెట్టివేస్తాయి. ఆర్తి, కుటుంబం కోసం తన చదువును త్యాగం చేసి పెళ్లి చేసుకుంటుంది. ఇక ఒకపక్క జీవితాన్ని నెట్టుకొస్తూనే ప్రభు.. తన ప్రేమ ప్రయాణాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు.. ? చివరికి తన తండ్రి కోరికను నెరవేర్చగలిగాడా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం 3 BHK ఓటీటీలో విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తుంది. మరి ముందు ముందు ఈ సినిమా ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.

Akira Nandan: 'ఓజీ' లో పవన్ వారసుడు.. ఇదిగో ప్రూఫ్

Rajinikanth: నాకు.. సత్యరాజ్‌కు అభిప్రాయ భేదాలు నిజ‌మే!

Updated Date - Aug 03 , 2025 | 09:35 PM