Akira Nandan: 'ఓజీ' లో పవన్ వారసుడు.. ఇదిగో ప్రూఫ్

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:54 PM

టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నట వారసుడు అకీరా నందన్(Akira Nandan) టాలీవుడ్ ఎంట్రీ కోసం మెగా ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

OG Movie

Akira Nandan: టాలీవుడ్ లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నట వారసుడు అకీరా నందన్(Akira Nandan) టాలీవుడ్ ఎంట్రీ కోసం మెగా ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పవన్, రేణు దేశాయ్ ల పెద్ద కుమారుడు అకీరా ఎప్పుడెప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడా.. ? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అకీరా మాత్రం ఇప్పుడప్పుడే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేలా కనిపించడం లేదని టాక్ నడుస్తుంది.


ఇంకో పక్క అకీరా టాలీవుడ్ ఎంట్రీ కచ్చితంగా ఈ ఏడాదిలోనే ఉంటుంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ అనేది రాలేదు. అకీరా ప్రస్తుతం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తనకు హీరోగా నటించాలి అని ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని అకీరా తల్లి రేణు దేశాయ్ చెప్పకనే చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యకాలంలోఅకీరా తండ్రి పక్కనే ఎక్కువ కనిపిస్తున్నాడు


ఆరడుగుల ఎత్తు.. హీరోకు తగ్గ గ్లామర్ తో అకీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ, పవన్ కూడా అకీరా టాలీవుడ్ ఎంట్రీపై అంత సీరియస్ నెస్ చూపించడం లేదని తెలుస్తోంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే గత కొన్ని రోజులుగా అకీరా.. పవన్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అకీరా ఎంట్రీపై మేకర్స్ ఎవరు అధికారికంగా స్పందించలేదు. కానీ, నిన్న రిలీజ్ అయిన ఫైర్ స్ట్రామ్ సాంగ్ లో అకీరా కనిపించడం పలు అనుమానాలకు దారితీస్తుంది.


ఫైర్ స్ట్రామ్ సాంగ్ లో కొన్ని పోస్టర్స్ లోఅకీరా కటౌట్ కనిపించినట్లు తెలుస్తుంది. చాలామంది ఆ పోస్టర్స్ లో ఉన్నది అకీరా అని చెప్పుకొస్తున్నారు. ఒడ్డు, పొడుగు మొత్తం అకీరా కటౌట్ కి చక్కగా సరిపోవడంతో పవన్ వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని బలంగా చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం అది అకీరా కాదని జపనీస్ నటుడు అని చెప్పుకొస్తున్నారు. అయితే తమన్ కూడా ఈ పోస్టర్ ను షేర్ చేయడంతో కచ్చితంగా ఇది అకీరానే అయి ఉంటాడని, అందుకే తమ షేర్ చేశాడని కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే అకీరా టాలీవుడ్ ఎంట్రీ కి గట్టి పునాది పడినట్లే అని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఓజీలో అకీరా నందన్ ఉన్నాడా లేదా అనేది తెలియాలంటే ఇంకొక నెల ఆగాల్సిందే.

Monday Tv Movies: సోమవారం, ఆగస్టు 4 తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు.. టైమింగ్‌తో సహా పూర్తి లిస్ట్!

Siri And Priyanka Jain: ఛీఛీ.. మీకసలు సిగ్గుందా.. పెళ్లి కాకుండా ఈ పూజలు ఏంటి

Updated Date - Aug 03 , 2025 | 08:55 PM