సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Venky -Vinayak: వెంకటేశ్‌.. వి.వి.వినాయక్‌.. వినోదానికి యాక్షన్‌ మేళవించి..

ABN, Publish Date - Sep 01 , 2025 | 11:16 AM

వెంకటేశ్‌ (venkatesh) - వి.వి.వినాయక్‌ (VV Vinayak) కలయికలో వచ్చిన ‘లక్ష్మీ’ (lakshmi) చిత్రం సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంమినేషన్‌లో మరో చిత్రం రాలేదు.


వెంకటేశ్‌ (venkatesh) - వి.వి.వినాయక్‌ (VV Vinayak) కలయికలో వచ్చిన ‘లక్ష్మీ’ (lakshmi) చిత్రం సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంమినేషన్‌లో మరో చిత్రం రాలేదు. తాజా సమాచారం ప్రకారం వినాయక్‌, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని, అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని  తెలిసింది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్‌ సినిమా చిత్రీకరణకు వెళ్లే అవకాశం ఉంది.



వెంకీ, వినాయక్‌ కాంబోలో వచ్చిన లక్ష్మీకి ఆకుల శివ కథ అందించారు. మరోసారి వెంకటేశ్‌ కోసం ఆయనే కథని సిద్థం చేశారు. వి.వి.వినాయక్‌ తన తరహా మాస్‌, కామెడీ జానర్‌ని గుర్తు చేసేలా కామెడీకి కాస్త యాక్షన్‌ జోడించి ఈ స్ర్కిప్ట్‌ సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ‘లక్ష్మీ’ని నిర్మించిన నల్లమలుపు బుజ్జి నిర్మాణంలోనే ఈ సినిమా ఉండబోతోందని తెలిసింది. ప్రస్తుతం వెంకటేశ్‌ , త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఆయన చిరుతో కలిసి షూటింగ్‌లో పాల్గొనున్నారు. తెలుగులో ఇంటెలిజెంట్‌, హిందీ ఛత్రపతి రీమేక్‌ తర్వాత వి.వి.వినాయక్‌ మరో సినిమా చేయలేదు. మళ్లీ ఇప్పుడాయన తనదైన శైలి కథతో రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. 

ALSO READ: Dragon: ఎన్టీఆర్‌కు జోడీ కుదిరింది..

Monday Tv Movies: సోమ‌వారం, సెప్టెంబ‌ర్‌ 01.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే తెలుగు సినిమాలివే

Krish Jagarlamudi: స్వీటీపై మాట పడకుండా బాగానే కవర్ చేశాడే

Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ నోట్‌

Updated Date - Sep 01 , 2025 | 12:21 PM