Dragon: ఎన్టీఆర్‌కు జోడీ కుదిరింది..

ABN , Publish Date - Sep 01 , 2025 | 09:38 AM

జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth neel) దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే!


జూ.ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (Prashanth neel) దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ‘డ్రాగన్‌’ (Dragon) అనే ఐటిల్‌ అనుకుంటున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఇందులో ఎన్టీఆర్‌ సరసన రుక్మిణీ వసంత్‌ కనిపించనున్నట్లు చాలాకాలంగా నెట్టింట వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇప్పుడీ నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ అధికారికంగా ప్రకటించారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తోన్న చిత్రం ‘మదరాసి’. శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.

అందులో ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ రుక్మిణీ వసంత్‌ అప్‌కమింగ్‌ సినిమాల గురించి చెప్పారు. ‘మదరాసి’లో రుక్మిణీని ఎంపిక చేసినప్పుడు ఆ అమ్మాయి అప్‌కమింగ్‌ హీరోయిన్‌. ఈరోజు ‘కాంతార 2’లో ఆ అమ్మాయే హీరోయిన్‌. తెలుగులో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తుంది. ‘టాక్సిక్‌’లోనూ అవకాశం అందుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమా కోసం కష్టపడింది. మరో నెల రోజల తర్వాత ‘కాంతార 2’ ప్రచారంలో పాల్గొనుంది’ అన్నారు. ఎన్వీ ప్రసాద్‌ మాటలతో రుక్మిణి డ్రాగన్‌ చిత్రంలో హీరోయిన్‌ అని అధికారికంగా ప్రకటించినట్లయింది. ‘డ్రాగన్‌’పై భారీగా అంచనాలున్నాయి.  షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కర్ణాటకలో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెలలో హైదరాబాద్‌లో మరో  షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు.  

ALSO READ: Monday Tv Movies: సోమ‌వారం, సెప్టెంబ‌ర్‌ 01.. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే తెలుగు సినిమాలివే

Krish Jagarlamudi: స్వీటీపై మాట పడకుండా బాగానే కవర్ చేశాడే

Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ నోట్‌

Updated Date - Sep 01 , 2025 | 10:21 AM