Divya Khosla: తెలుగు చిత్రసీమలోనే...

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:26 PM

తెలుగు సినిమాతోనే రెండు దశాబ్దాల క్రితం సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయిన దివ్యా ఖోస్లా కుమార్ ఇప్పుడు రెండు తెలుగు సినిమాలతో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది.

Divya Khosla Kumar

దివ్యా ఖోస్లా (Divya Khosla) అనగానే ఠక్కున గుర్తొచ్చేది ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆడియో కంపెనీ టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ (Bhushan Kumar) భార్య అని. అయితే దివ్యా ఖోస్లా నటి అని కూడా కొందరికి తెలుసు కానీ చిత్రం ఏమంటే... ఈ అందాల ముద్దుగుమ్మ నటిగా తన ప్రస్థానాన్ని తెలుగు సినిమా రంగంలోనే మొదలు పెట్టింది. వీడియో ఆల్బమ్స్ తో పాపులారిటీ పొందిన దివ్యా ఖోస్లా 2004లో 'లవ్ టుడే' (Love Today) మూవీలో ఉదయ్ కిరణ్‌ (Uday Kiran) సరసన నటించింది. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి. చౌదరి (R.B. Chowdary) నిర్మించారు. అయితే మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత సంవత్సరమే దివ్యా ఖోస్లా.. భూషణ్ కుమార్ ను వివాహం చేసుకుంది. కానీ నటన మీద మక్కువతో కాస్తంత గ్యాప్ తర్వాత తిరిగి హిందీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అలానే చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది.


అయితే ఫస్ట్ లవ్ టాలీవుడ్ ను మాత్రం దివ్యా ఖోస్లా కుమార్ మర్చిపోలేకపోతోంది. ఈ ఎడబాటును తట్టుకోలేకుండా ఉంది కూడా. అందుకే గత సంవత్సరం సురేశ్‌ కృష్ణ (Suresh Krishna) దర్శకత్వంలో 'హీరో హీరోయిన్' (Hero Heeroine) అనే మూవీకి దివ్యా ఖోస్లా కుమార్ సైన్ చేసింది. షూటింగ్ ప్రారంభమైంది. తెలుగు సినిమా రంగం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రోగ్రెస్ ఏమిటనే దానిలో క్లారిటీ లేదు. ఇందులో ఆమె ప్రియదర్శిని అనే హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో 'నాయక -నాయకి' అనే పేరు పెట్టారు. తన తెలుగు రీ-ఎంట్రీ మూవీ ఇంకా విడుదలకు నోచుకోకుండానే ఇప్పుడు సుధీర్ బాబు (Sudheer Babu) 'జటాధర' మూవీలో సితార అనే పాత్రను చేస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. దాదాపు ఇరవై యేళ్ళ తర్వాత కూడా తెలుగు సినిమా మీద ప్రేమ తగ్గకపోవడం విశేషం అనే చెప్పాలి. మరో ముచ్చట ఏమంటే 'జటాధర' మూవీతో సోనాక్షి సిన్హా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమా కూడా తెలుగు, హిందీ భాషల్లో రాబోతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి విజయవంతమైనా దివ్యా ఖోస్లా మరిన్ని తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం.

Also Read: Nora Fatehi: ఆ సినిమా త‌ర్వాత‌.. న‌న్ను.. బుక్ చేసుకునేందుకు వెంట ప‌డ‌తారు

Also Read: Nitya Ram: కూలీ కళ్యాణి అక్క కూడా హీరోయినే.. ఎవరో తెలుసా

Updated Date - Aug 25 , 2025 | 04:34 PM

T Series : టీ-సిరీస్ సంచలనం

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Bhushan Kumar: భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలకు నో

Bhushan Kumar: ‘యానిమల్’ గ్యాంగ్‌స్టర్ సినిమా.. ‘స్పిరిట్’ కాప్ డ్రామా..

Jatadhara First Look: విజువల్‌ వండర్‌గా జటాధర