Nitya Ram: కూలీ కళ్యాణి అక్క కూడా హీరోయినే.. ఎవరో తెలుసా

ABN , Publish Date - Aug 25 , 2025 | 04:07 PM

రచితా రామ్ (Rachita Ram).. కూలీ (Coolie) సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణంగా ఒక సినిమాలో హీరో హైలైట్ అవుతాడు.. హీరోయిన్ హైలైట్ అవుతుంది..

Nitya Ram - Rachita Ram

Ntiya Ram: రచితా రామ్ (Rachita Ram).. కూలీ (Coolie) సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణంగా ఒక సినిమాలో హీరో హైలైట్ అవుతాడు.. హీరోయిన్ హైలైట్ అవుతుంది.. కొన్నిసార్లు విలన్ కూడా బాగా పేరు తెచ్చుకుంటాడు. అయితే ఈ మధ్యకాలంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ బాగా హైలైట్ అవుతున్నాయి. అలాంటి ఒక క్యారెక్టరే కళ్యాణి. రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్నా కూడా రికార్డ్ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన పాత్ర అంటే అది కళ్యాణి అని చెప్పాలి.


మొదటి నుంచి సైలెంట్ గా ఉన్న ఈ పాత్ర ప్రీ క్లైమాక్స్ లో ఒక్కసారిగా హైలైట్ గా మారిపోతుంది. నాగార్జున కొడుకును ప్రేమ పేరుతో మోసం చేసి.. అతడిని చంపే సీన్ లో అయితే కళ్యాణి నట విశ్వరూపం చూపించింది అని చెప్పొచ్చు. ఆ పాత్రలో అదరగొట్టిన బ్యూటీ రచితా రామ్. కూలీ సినిమా తరువాత అమ్మడికి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా రచితా వీడియోస్, ఆమె నటన గురించే చర్చ. కూలీలో ఎవరి నటన గురించి అయినా మాట్లాడుకోవాల్సి వస్తే మొదట దయాల్.. ఆ తరువాత కళ్యాణి గురించే చెప్పుకొస్తారు.


ఇక కూలీ హిట్ అయ్యాకా అందరూ రచితా రామ్ గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఆమె ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ? అని తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ తెల్సింది. అదేంటంటే.. రచితానే కాదు ఆమె అక్క కూడా హీరోయినే. ఆమె తెలుగువారికి కూడా సుపరిచితురాలే. ఏంటి నిజమా.. ఎవరామె అని అంటే.. నిత్యా రామ్. ఎక్కడో విన్న పేరులా అనిపిస్తుందా.. ? తెలుగు సీరియల్ హీరోయిన్ గా బాగా పాపులర్ అయిన నిత్యా రామ్ చెల్లినే రచితా రామ్. తెలుగులో ముద్దు బిడ్డ, అమ్మ నా కోడలా, నందిని లాంటి సీరియల్స్ తో మెప్పించిన నిత్యా ప్రస్తుతం తమిళ్, కన్నడ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది.


తెలుగులో నిత్యా రామ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా నందిని సీరియల్ లో అమ్మడి నటనకు ఫిదా అవ్వని వారుండరు. నెగిటివ్ రోల్ లో నిత్యా నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక అంతటి డేంజర్ అయిన అక్కనే.. చెల్లి మరిపించింది. కూలీలో రచితా నటన చూసి.. అక్క డేంజర్ అనుకుంటే.. చెల్లి యమా డేంజర్ లా ఉందే అని నెటిజన్స్ వారిద్దరి వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏదిఏమైనా నటనలో ఈ అక్కాచెల్లెళ్లు మాత్రం అదరగొట్టేస్తారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Swasika: రామ్ చరణ్ మూవీనే రిజెక్ట్ చేశా.. తమ్ముడు బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Parineeti Chopra: పరిణీతి, రాఘవ్‌ చద్దా  దంపతుల గుడ్‌ న్యూస్‌..

Updated Date - Aug 25 , 2025 | 04:27 PM