Nora Fatehi: ఆ సినిమా తర్వాత.. నన్ను.. బుక్ చేసుకునేందుకు వెంట పడతారు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:09 PM
తెలుగు వారికి ప్రత్యుకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేని నటి నోరా ఫతేహి.
తెలుగు వారికి ప్రత్యుకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేని నటి నోరా ఫతేహి (Nora Fatehi). ఇప్పటికే తెలుగులో టెంపర్ (Temper), బాహుబలి (Baahubali), కిక్ (Kick 2), తాజాగా మట్కా (Matka) సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో ఆడి పాడి అలరించింది. ప్రస్తుతం హిందీలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు తమిళనాట అడుగు పెడుతోంది. ఇటీవలే లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచన4 (Kanchana 4)చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde)తో కలిసి కీలక పాత్రకు సెలక్ట్ అయింది. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కు తున్న 'కాంచన-4స (Kanchana 4) చిత్రం తర్వాత కోలీవుడ్‌లో మరిన్ని సినిమాల్లో నటించేందుకు తనకు అవకాశాలు వస్తాయని, తనను సినిమాల్లో బుక్ చేసుకునేందుకు కోలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీ పడతారని బాలీ వుడ్ నటి నోరా ఫతేహి అంటున్నారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ, 'తమిళంలో 'కాంచన' మూవీ నాలుగో భాగంలో నటిస్తున్నాను. ఈ మూవీ ఘన విజయం సాధిస్తుంది.
ఈ సినిమా విజయం సాధించిన తర్వాత తమిళంలో అనేక అవకాశాలు వస్తాయని, ముఖ్యంగా కోలీవుడ్ నిర్మాతలు నన్ను బుక్ చేసుకునేందుకు గాలిస్తారు. 'కాంచన'లో అలాంటి మంచి పాత్రలో నటిస్తున్నాను. పైగా ఆ చిత్రం ఖచ్చితంగా ఓ బ్లాక్బస్టర్ హిట్‌గా నిలుస్తుంది' అని పేర్కొన్నారు. 2020లో వచ్చిన కాంచన మూవీని రాఘవ లారెన్స్ హిందీలోకి రీమేక్ చేసున్నారు. మరోవైపు తమిళంలో 'కాంచన-4' తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూజా హెగ్గే నోరా ఫతేహిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.