T Series : టీ-సిరీస్ సంచలనం

ABN , Publish Date - Aug 23 , 2025 | 05:42 PM

భారతీయ సంగీతం గర్వించే క్షణం ఇది.. మన పాటలు ప్రపంచాన్ని ఏలుతున్నాయని చెప్పడానికి ఉదాహరణ ఇది.. ఇండియాకు చెందిన ప్రముఖ మ్యూజిక్ ఆల్బమ్ సంస్థ తాజాగా ప్రపంచ రికార్డును సాధించడం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ సంగీత దిగ్గజం టీ-సిరీస్ (T Series) మరోసారి సంచలనం సృష్టించింది. యూట్యూబ్‌లో 300 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ మార్క్‌ను టచ్ చేసిన తొలి సంగీత ఛానెల్‌గా నిలిచింది. హిందీ సినిమా చార్ట్‌బస్టర్స్ నుంచి పాన్-ఇండియా సెన్సేషనల్ ఆల్బమ్‌ల వరకు‌ మొదటినుంచి టీ-సిరీస్ ఎప్పుడూ ట్రెండ్‌సెట్టరే. ఈ 300 మిలియన్ మైలురాయి కేవలం సంఖ్య కాదు.. భారతీయ సంగీతం గ్లోబల్ రీచ్‌కు సింబల్ గా చెప్పుకోవచ్చు.


వాస్తవానికి ఒకప్పుడు యూట్యూబ్‌లో నంబర్ వన్ ఛానెల్‌గా రాజ్యమేలింది టీ-సిరీస్‌‌. కానీ దీన్ని మిస్టర్ బీస్ట్ ఓవర్‌టేక్ చేశాడు. ఇప్పుడు 300 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌తో ఇప్పుడు గ్లోబల్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జర్నీలో టీ-సిరీస్ హిందీ సినిమా సాంగ్స్, భక్తి గీతాలు, ఇండీ-పాప్, పాన్-ఇండియా ఆల్బమ్‌లతో దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించింది. దీని వీడియోలు బిలియన్ల వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి.

టీ-సిరీస్ బాస్ భూషణ్ కుమార్ (Bhushan kumar)లీడర్‌షిప్‌లో ఈ ఛానెల్ ఎప్పటికీ ఫ్రెష్ వైబ్‌తో దూసుకెళ్తోంది. బాలీవుడ్ హిట్స్ నుంచి రీజనల్ సాంగ్స్, ట్రైలర్స్ వరకు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదే స్పీడును అలాగే కంటిన్యూ చేస్తే మళ్లీ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయికి చేరుకోవడం పెద్ద కష్టమే కాదంటున్నారు విశ్లేషకులు. మరి ఫ్యూచర్‌లో టీ-సిరీస్ ఈ గ్రోత్‌ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.

Read Also: Mirai Making: సూపర్‌ యోధగా తేజ.. చుక్కలు చూపిస్తున్నారుగా..  

Read Also: NTR: షాకింగ్.. శ్రీలీల డ్యాన్సర్ కావడానికి కారణం ఎన్టీఆర్ అంట

Updated Date - Aug 23 , 2025 | 05:45 PM