Raashii Khanna: తెలుసు కదా యూనిక్ సబ్జెక్ట్
ABN, Publish Date - Oct 11 , 2025 | 07:16 PM
ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా 'తెలుసు కదా, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలలో నటిస్తోంది. 'తెలుసు కదా' యూనిక్ పాయింట్ తో తెరకెక్కుతున్న సినిమా అని, 'ఉస్తాద్ భగత్ సింగ్'లో పవన్ కళ్యాణ్ సరసన నటించడం ఆనందంగా ఉందని చెప్పింది.
'మిరాయ్' (Mirai) లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' (Telusu kada). ఈ సినిమా ద్వారా స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా విలేకరుల సమావేశంలో పలు ఆసక్తికరమైన అంశాలను తెలియచేసింది.
కథ గురించి రాశీ మాట్లాడుతూ, 'కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నీరజ ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ వున్నాయి. ఇందులో మూడు పాత్రలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా చేస్తున్నపుడు చాలా ట్రిగ్గర్ అయ్యాను. ఆడియన్స్ కూడా అవుతారు. మనం చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూసుకుంటాం. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ వుంది. ఆ పాయింట్ మీరు థియేటర్స్ లో చూడాలి. అది ఆడియన్స్ ని ఎక్సయిట్ చేస్తుంది' అని తెలిపింది.
షూటింగ్ గురించి చెబుతూ, 'ఈ సినిమా షూటింగ్ లో చాలా సర్ ప్రైజ్ అయ్యాను. అలాంటి సర్ ప్రైజ్ ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తారు. చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్ తో సినిమా ఇప్పటివరకూ నేను చూడలేదు. ఇందులో అంజలి పాత్రలో నేను కనిపిస్తాను. అయితే ఒకటి నిజం నా రియల్ లైఫ్ కి ఆ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేవు' అని చెప్పింది.
హీరో సిద్ధు, డైరెక్టర్ నీరజ గురించి మాట్లాడుతూ, 'సిద్దు ఆన్ సెట్ లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్ గా వుంటారు. ఆయనకి ప్రతి క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ వుంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్. ఇక నీరజ కథ చెప్పినప్పుడే షాక్ అయ్యాను. అంత యూనిక్ స్క్రిప్ట్ ఎలా రాయగలిగారనిపించింది. తనకు ప్రతి విషయంపై నాలెడ్జ్ వుంది. ఒక ఎక్స్ పీరియన్స్ డైరెక్టర్ తో వర్క్ చేసినట్లుగానే అనిపించింది' అని చెప్పింది. శ్రీనిధితో తనకు మంచి సీన్స్ ఉన్నాయని, తన చాలా ఫన్ పర్శన్ అని, ఈ పిక్చర్ షూటింగ్ సమయంలో తాము మంచి ఫ్రెండ్స్ అయ్యామని రాశీ ఖన్నా తెలిపింది. తమన్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారని, అలానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో తాను చేసిన రెండో సినిమా ఇదని, దీనికి ముందు 'వెంకీ మామ'లో చేశానని రాశి గుర్తు చేసుకుంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagath Singh) మూవీలోనూ రాశీ ఖన్నా నటిస్తోంది. పవన్ గురించి చెబుతూ, 'ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. ఆయనకు జనాలలో ఉన్న ఫాలోయింగ్, ఆయన ఆరా నెక్ట్స్ లెవల్' అని కితాబిచ్చింది. ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాలు చేస్తున్నానని తెలిపింది రాశీఖన్నా.
Also Read: Ram Charan: మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
Also Read: K Ramp Trailer: అదిరిపోయిన కె ర్యాంప్ ట్రైలర్.. రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే