K Ramp Trailer: అదిరిపోయిన కె ర్యాంప్ ట్రైలర్.. రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే
ABN , Publish Date - Oct 11 , 2025 | 07:01 PM
కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) క సినిమా తరువాత జోష్ పెంచాడు. దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
K Ramp Trailer: కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) క సినిమా తరువాత జోష్ పెంచాడు. దిల్ రుబా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం కిరణ్ నుంచి వస్తున్న కొత్త చిత్రం కె ర్యాంప్. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నీ రాజేష్ దండా, శివ బొమ్మక్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్ సరసన యుక్తి తరేజా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
దీపావళీ కానుకగా కె ర్యాంప్ అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. కిరణ్ ఈసారి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నట్లు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. టీజర్ లో బూతు పురాణాలను చూపించి విమర్శలు అందుకున్న టీమ్.. ట్రైలర్ లో అలాంటివేమీ లేకుండా జాగ్రత్త పడింది.
కుమార్.. తల్లి లేని బిడ్డ. డబ్బు ఉన్నా కూడా పెంచేవారు లేకపోవడంతో ఆకతాయిగా పెరుగుతాడు. కాలేజ్ లో ఫ్రెండ్స్, గొడవలు ఇవి తప్ప ఇంకేమి ఉండవు. ఆ సమయంలోనే కుమార్ కు ఒక అమ్మాయి నచుతుంది. ఆమె వెంటపడి మరీ లవ్ ను ఒప్పిస్తాడు. ఆ తరువాత కుర్రాడికి మొదలవుతుంది కె ర్యాంప్. గర్ల్ ఫ్రెండ్ పెద్ద సైకో కావడం.. అతడికి చుక్కలు చూపించడం ట్రైలర్ లో చూపించారు. చివరికి కుమార్ పరిస్థితి ఏమైంది.. ? గర్ల్ ఫ్రెండ్ అలా ప్రవర్తించడానికి కారణం ఏంటి.. ? కుమార్ లైఫ్ లోకి వచ్చిన మిగతవారు ఎవరు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ మొత్తం వినోదాత్మకంగా బాగా కట్ చేశారు. మొదటిసారి కిరణ్.. రొమాన్స్ బాగా ఘాటుగా చేసినట్లు కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో కిరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Ram Charan: మోదీని కలిసి.. రామ్ చరణ్ దంపతులు
Dark ChocolateTeaser: ఛీఛీ.. రానా.. సక్సెస్ కోసం ఇంత దిగజారాలా